Amaravati : అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!
Amaravathi : గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్ల పరిపాలనలో రాజధాని లేని రాష్ట్రంగానే ఆంధ్ర ప్రదేశ్ ని ఉంచింది. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పై మళ్లీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీ రాజధాని అమరావతినే కన్ ఫర్మ్ చేసిన కూటమి ప్రభుత్వం రాజధాని పనులను పూర్తి చేసేందుకు నడుం బిగించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నెక్స్ట్ మినిట్ నుంచి రాజధాని అమరావితిలో ఉన్న జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇలా అందరు కూడా రాజధాని పై ఒకటే మాట మీద ఉన్నారు. ఇప్పటికే రెండు నెలల్లో ప్రాధమికంగా ఉన్న జంగిల్ క్లియరెన్స్ పూర్తి కాగా ఇక ప్రధాన రహదారులు, విద్యుత్ దీపాల పనులు కూడా పూర్తి చేశారు. రాజధాని కోసం కేంద్రం నుంచి 15 వేల కోట్ల రూపాయలు తీసుకురాగా.. ఇదే కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి రాజధాని కోసం మరికొంత డబ్బుల్ తీసుకొచ్చే పనుల్లో ఉన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే 15 వేల కోట్లు కాకుండానే ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా కొంత మొత్తాన్ని తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే సి.ఆర్.డి ఏ బృందం ఏర్పాటు చేసిన ప్రణాళిక, వ్యూహం వరడ్ బ్యాంక్ ఎదుట ఉంచారు.
వరల్డ్ బ్యాంక్ టీం కూడా అమరావతి వచ్చి ఇక్కడ పర్యటన చేస్తున్నారు. రాజధాని పరిధిలో జరుగుతున్న కట్టడాలు, నిర్మాణాలను పరిశీలిస్తుంది. ఐతే ఈ టైం లోనే అమరావతి పూర్తి చేయడానికి కావాల్సిన మిగ్తా రుణం పై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. కొత్త నగరాలు నిర్మించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏపీ రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకోగా.. మరో 21 ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయించింది. అంటే మొత్తం 54 ఎకరాల్లో అమరావతిని నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Amaravathi : క్యాపిటల్ మీదే బాబు స్పెషల్ ఫోకస్.. ఆపరేషన్ 2050 షురూ..!
ఇక అమరావతి లో జరుగుతున్న నిర్మాణాలను బెంగుళూరు, హైదరాబాద్ కు సంబంధించిన ఐఐటీ నిపుణులు కూడా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. 2050 నాటికి అమరావతి రాజధాని పూర్తి అంచనా వేసుకునేలా అవసరాలకు తగినట్టుగా నిర్మాణాలు చేపట్టాలని సీ.ఆర్.డి.ఏ భావిస్తుంది. ఇందుకు సంబందించి కీలక ప్రాజెక్ట్ లను ప్రపంచ బ్యాంక్ ముందు ఉంచింది. క్యాపిటల్ లో రోడ్లు, సీనరేజ్, కనెక్టివిటీ, యుటిలిటీ కార్డార్లు, విలేజ్ రోడ్లు, ట్రంక్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇంకా వరద ముంపు నివారణ కాలువల ఏర్పాట్లు ఇలాంటి వాటికి నిధులు ఇవ్వాలని వరల్డ్ బ్యాంక్ ని కోరింది. దీనికి వరల్డ్ బ్యాంక్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తుంది.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.