Jio 5G Phone : మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ రేట్ లోనే జియో 5జీ.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jio 5G Phone : మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. తక్కువ రేట్ లోనే జియో 5జీ..

 Authored By mallesh | The Telugu News | Updated on :3 February 2022,7:00 am

Jio 5G Phone : దేశంలోని టెలికాం రంగంలో జియో ఎంటర్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. కొత్త కొత్త ఆఫర్లతో దాదాపుగా కస్టమర్లను తన వైపు తిప్పుకుంది జియో. మొదట్లో జియో ఫోన్‌ను కేవలం 1500 రూపాయలకే ప్రవేశపెట్టి సామాన్యలకు సైతం అందుబాటు ధరలోనే సేవలను అందించింది. తర్వాత 4జీ సిమ్ లను తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ యూజర్లను సైతం ఆకర్షించింది. తక్కువ ధరకే టారీఫ్ ప్లాన్ లు అందించింది. దీంతో దాదాపుగా మార్కెట్ జియో వైపే తిరిగింది. దీని ఫలితంగా మిగతా నెట్‌వర్క్ కంపెనీలు తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరలకే టారిఫ్ ప్లాన్స్ అందించారు.ప్రస్తుతం దేశంలో 4జీ నెట్ వర్క్ నడుస్తోంది. కానీ కేంద్ర బడ్జెట్‌లో 5జీ ప్రస్తావన వచ్చింది.

కానీ అంతకంటే ముందే చాలా కంపెనీలు 5జీ నెట్ వర్క్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం జియో సైతం అదే బాటులో ఉంది. కాకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్ ను అందించేందుు జియో నిర్ణయించింది. ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ జియో 5జీ ఫోన్‌ ధర మన దేశంలో రూ.9వేల నుంచి రూ.12వేల మధ్య ఉండే ఉండే చాన్స్ ఉంది. 1,600 x 720 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.5అంగుళాల హెచ్‌డీ, ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉంటుంది. 60Hz రిఫ్రెష్‌రేట్‌ను కలిగి ఉండబోతున్నదని సమాచారం.

Good news for mobile users in 5g phone from jio

Good news for mobile users in 5g phone from jio

Jio 5G Phone : స్పెసిఫికేషన్స్ ఇవే..

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ ఉండే చాన్స్ ఉంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 32 ఇంటర్నల్‌ స్టోరేజీ, మైక్రోఎస్‌డీ కార్డుతో దీని స్పెసిఫికేషన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో ఉండనుంది. మెయిన్ కెమెరా 13ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5వేల ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరలో ఈ మొబైల్ మార్కెట్ లోకి వచ్చే చాన్స్ ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది