Jio 5G Phone : దేశంలోని టెలికాం రంగంలో జియో ఎంటర్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. కొత్త కొత్త ఆఫర్లతో దాదాపుగా కస్టమర్లను తన వైపు తిప్పుకుంది జియో. మొదట్లో జియో ఫోన్‌ను కేవలం 1500 రూపాయలకే ప్రవేశపెట్టి సామాన్యలకు సైతం అందుబాటు ధరలోనే సేవలను అందించింది. తర్వాత 4జీ సిమ్ లను తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ యూజర్లను సైతం ఆకర్షించింది. తక్కువ ధరకే టారీఫ్ ప్లాన్ లు అందించింది. దీంతో దాదాపుగా మార్కెట్ జియో వైపే తిరిగింది. దీని ఫలితంగా మిగతా నెట్‌వర్క్ కంపెనీలు తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరలకే టారిఫ్ ప్లాన్స్ అందించారు.ప్రస్తుతం దేశంలో 4జీ నెట్ వర్క్ నడుస్తోంది. కానీ కేంద్ర బడ్జెట్‌లో 5జీ ప్రస్తావన వచ్చింది.
కానీ అంతకంటే ముందే చాలా కంపెనీలు 5జీ నెట్ వర్క్ ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం జియో సైతం అదే బాటులో ఉంది. కాకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్ ను అందించేందుు జియో నిర్ణయించింది. ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం ఈ జియో 5జీ ఫోన్ ధర మన దేశంలో రూ.9వేల నుంచి రూ.12వేల మధ్య ఉండే ఉండే చాన్స్ ఉంది. 1,600 x 720 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.5అంగుళాల హెచ్‌డీ, ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉంటుంది. 60Hz రిఫ్రెష్‌రేట్‌ను కలిగి ఉండబోతున్నదని సమాచారం.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్ ఉండే చాన్స్ ఉంది. 4జీబీ ర్యామ్‌తో పాటు 32 ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రోఎస్‌డీ కార్డుతో దీని స్పెసిఫికేషన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఉండనుంది. మెయిన్ కెమెరా 13ఎంపీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటనున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివరలో ఈ మొబైల్ మార్కెట్ లోకి వచ్చే చాన్స్ ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.