Ration Card : అర్హులైన నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మేరా రేషన్ మేరా అధికార్ కార్యక్రమం కింద పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ స్కీం కింద అర్హులైన పేదలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని ఆగస్టు 5న ప్రారంభించారు.కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 11 రాష్ట్రాల్లో ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటివరకు ఇందులో 13వేల మంది అప్లికేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ స్కీం కింద నిరాశ్రయులైన ప్రజలు, నిరుపేదలు, వలసదారులు, ఇతర అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించడమే దీని లక్ష్యం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన వారిని గుర్తించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని డీఎఫ్‌పీడీ సెక్రటరీ సుదాన్షు పాండే వెల్లడించారు. ఈ స్కీంలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో తెలంగాణ, హర్యానా, చండీగఢ్,హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్,గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లతో కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కవరేజీని అందిస్తారు.
ఈ పథకాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తీసుకొచ్చారు. ఎన్ఎఫ్సీఏ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యం కోసం డీఎఫ్పీడీ సెక్రటరీ ఆగస్టు 5 నుంచి 11 రాష్ట్రాలైన గోవా, లక్ష్యదీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు వెబ్ ఆధారిత రిజస్ట్రేషన్ సౌకర్యం మేరా రేషన్ మేరా అధికార్ పథకాన్ని ప్రారంభించారు. https://nfsa.gov.in ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81.35 కోట్ల మందికి దీని ఫలితాలు అందుతాయని కేంద్రం భావిస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.