Ration Card : నిరుపేదలకు కేంద్రం శుభవార్త.. అర్హులైన వారు కొత్త రేషన్ కార్డును ఇలా దరఖాస్తు చేసుకోండి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ration Card : నిరుపేదలకు కేంద్రం శుభవార్త.. అర్హులైన వారు కొత్త రేషన్ కార్డును ఇలా దరఖాస్తు చేసుకోండి?

 Authored By mallesh | The Telugu News | Updated on :9 September 2022,7:00 am

Ration Card : అర్హులైన నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మేరా రేషన్ మేరా అధికార్ కార్యక్రమం కింద పేదలకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ స్కీం కింద అర్హులైన పేదలు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిని ఆగస్టు 5న ప్రారంభించారు.కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 11 రాష్ట్రాల్లో ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటివరకు ఇందులో 13వేల మంది అప్లికేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

Ration Card : నిరుపేదలకే ప్రాధాన్యం

ఈ స్కీం కింద నిరాశ్రయులైన ప్రజలు, నిరుపేదలు, వలసదారులు, ఇతర అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించడమే దీని లక్ష్యం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అర్హులైన వారిని గుర్తించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని డీఎఫ్‌పీడీ సెక్రటరీ సుదాన్షు పాండే వెల్లడించారు. ఈ స్కీంలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో తెలంగాణ, హర్యానా, చండీగఢ్,హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్,గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, పుదుచ్చేరి, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లతో కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కవరేజీని అందిస్తారు.

good news for poor people eligible people apply for new ration card like

good news for poor people eligible people apply for new ration card like

ఈ పథకాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తీసుకొచ్చారు. ఎన్ఎఫ్సీఏ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యం కోసం డీఎఫ్పీడీ సెక్రటరీ ఆగస్టు 5 నుంచి 11 రాష్ట్రాలైన గోవా, లక్ష్యదీప్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, త్రిపుర, ఉత్తరాఖండ్‌లకు వెబ్ ఆధారిత రిజస్ట్రేషన్ సౌకర్యం మేరా రేషన్ మేరా అధికార్ పథకాన్ని ప్రారంభించారు. https://nfsa.gov.in ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81.35 కోట్ల మందికి దీని ఫలితాలు అందుతాయని కేంద్రం భావిస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది