
make money by setting up an sbi franchise atm
SBI : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. పరిమిత కాల డిపాజిట్లపై (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచింది. ఒక వారం వ్యవధిలో రెండు సార్లు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. పదేళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. పెంచిన కొత్తరేట్లు జనవరి 22 నుంచి వర్తించనున్నాయి. వడ్డీ రేట్లు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..ఎస్బీఐ ప్రస్తుతం రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాయిట్లపై 5.10 శాతం వడ్డీని అందిస్తోంది.
గతంలో ఈ వడ్డీ రేటు 5 శాతంగా ఉండేది. ఒక వారం వ్యవధిలో స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు FD రేటును 2 సార్లు పెంచి ప్రయోజనాన్ని అందించింది. మరోవైపు సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్లకే ఎక్కువగా వడ్డీ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీకి 5.60 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ రేటు 5.50 శాతంగా ఉండేది. ఎస్బీఐ గతేడాది జనవరిలో FD వడ్డీ రేట్లను పెంచింది.కొత్త వడ్డీ రేట్ల ప్రకారం.. 7 నుంచి 45 రోజులు – సాధారణ ప్రజలకు 2.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతంగా రానుంది. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు జనరల్ 3.90 శాతం, సీనియర్ సిటిజన్ 4.40 శాతంగా ఉంది.
good news for sbi customer increase in interest rates on fixed deposits
180 నుంచి 210 రోజుల వరకు జనరల్ 4.40 శాతం సీనియర్ సిటీజన్ 4.90 శాతంగా ఇస్తున్నారు. 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటీజన్ 5.60 శాతంగా ఉంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు కంటే తక్కువ FDలు -జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటీజన్ 5.60 శాతం ఉంది. 3 ఏళ్ల లోపు నుంచి 5 ఏళ్ల కంటే తక్కువ -జనరల్ 5.30 శాతం, సీనియర్ సిటీజన్ 5.80 శాతం.. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిటర్ 5.40, సీనియర్ సిటీజన్ 6.20 శాతంగా వడ్డీ రేట్లను ప్రకటించారు.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.