SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI : ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు!

 Authored By mallesh | The Telugu News | Updated on :27 January 2022,5:00 pm

SBI : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. పరిమిత కాల డిపాజిట్లపై (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచింది. ఒక వారం వ్యవధిలో రెండు సార్లు వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. పదేళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకుంది. పెంచిన కొత్తరేట్లు జనవరి 22 నుంచి వర్తించనున్నాయి. వడ్డీ రేట్లు ఎంత మేర పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..ఎస్బీఐ ప్రస్తుతం రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాయిట్లపై 5.10 శాతం వడ్డీని అందిస్తోంది.

గతంలో ఈ వడ్డీ రేటు 5 శాతంగా ఉండేది. ఒక వారం వ్యవధిలో స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు FD రేటును 2 సార్లు పెంచి ప్రయోజనాన్ని అందించింది. మరోవైపు సాధారణ డిపాజిటర్ల కంటే సీనియర్ సిటిజన్లకే ఎక్కువగా వడ్డీ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీకి 5.60 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ రేటు 5.50 శాతంగా ఉండేది. ఎస్బీఐ గతేడాది జనవరిలో FD వడ్డీ రేట్లను పెంచింది.కొత్త వడ్డీ రేట్ల ప్రకారం.. 7 నుంచి 45 రోజులు – సాధారణ ప్రజలకు 2.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతంగా రానుంది. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు జనరల్ 3.90 శాతం, సీనియర్ సిటిజన్ 4.40 శాతంగా ఉంది.

good news for sbi customer increase in interest rates on fixed deposits

good news for sbi customer increase in interest rates on fixed deposits

SBI : స్టేట్ బ్యాంక్ ఇండియా పెంచిన రేట్ల ప్రకారం

180 నుంచి 210 రోజుల వరకు జనరల్ 4.40 శాతం సీనియర్ సిటీజన్ 4.90 శాతంగా ఇస్తున్నారు. 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటీజన్ 5.60 శాతంగా ఉంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లలోపు కంటే తక్కువ FDలు -జనరల్ 5.10 శాతం, సీనియర్ సిటీజన్ 5.60 శాతం ఉంది. 3 ఏళ్ల లోపు నుంచి 5 ఏళ్ల కంటే తక్కువ -జనరల్ 5.30 శాతం, సీనియర్ సిటీజన్ 5.80 శాతం.. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిటర్ 5.40, సీనియర్ సిటీజన్ 6.20 శాతంగా వడ్డీ రేట్లను ప్రకటించారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది