Sudha : సీనియర్ నటి సుధ అనగానే కొందరు వెంటనే గుర్తుపట్టేస్తారు. మరికొందరు సినిమాల పేర్లు చెబితే ఓ ఆవిడా మంచి యాక్టర్ అంటూ కొనియాడుతుంటారు. ఎందుకంటే ఆమె చేసిన క్యారెక్టర్స్ అటువంటింది. ఇండస్ట్రీలో ఆమె ఒక అలుపెరగని నటి.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. ఒకానొక టైంలో హీరోయిన్లకు తల్లిగా, హీరోలకు అక్కా, చెల్లి, అత్తగా ఇలా అన్ని పాత్రల్లోనూ సూపర్ అనిపించుకున్నారు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుధ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 900 పైగా సినిమాల్లో నటించారు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సీరియల్ నటిగా తన అద్బుత నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయి సుధ.. తన భర్త, కొడుకు వదిలేశారని చాలా ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరి దాన్ని అయిపోయానని కంటతడి పెట్టుకున్నారు.
సుధ తన కెరీర్‌లో దాదాపు ఎక్కువగా ఏడుపుగొట్టు క్యారెక్టర్లు చేసేది. తనకు రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లు చేయాలని ఉండేదని కానీ, ఎక్కువగా సెంటిమెంట్ రోల్స్ తను బాగా చేస్తానని అవే ఇచ్చేవారట దర్శకులు. ఇక అవార్డుల విషయానికి వస్తే తన పాత్రలకు మంచి పేరు వచ్చేది కానీ ఒక్క నంది అవార్డు కూడా రాలేదట. ఆమె ఒకప్పుడు నంది అవార్డుల కమిటీలో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చారు. అయినా, అవార్డు రాలేదని చెప్పింది. ఓ 10 మంది కూర్చుని డిసైడ్ చేసే అవార్డులు రాకపోయినా తనకు బాధలేదని, లక్షల మంది అభిమానం తనకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. సాధారణంగా అవార్డు అనేది ప్రోత్సాహానికి అని అంటుంటారు. నా దృష్టిలో అది అహంకారానికి సూచిక అని సుధ క్లారిటీ ఇచ్చారు.
అయితే, దర్శకుడు బాలచందర్ గారు తనను హీరోయిన్‌గా చూసిన కళ్లతోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఊహించారు. ఆయన ఒక్కసారి చూస్తే వీళ్లు ఎంతకాలం ఇండస్ట్రీలో ఉంటారని ఇట్టే చెప్పేస్తారట.. తను ఇప్పుడు ఇలా ఉండేందుకు కూడా ఆయనే కారణమన్నారు. అందంగా ఉండే నేను పని మనిషి క్యారెక్టర్‌కి కూడా సూట్ కానని అన్నారు. ఇప్పుడు అదే నిజం అయ్యింది. నేను చెప్పినట్టు చేస్తే.. నీ అంతట నువ్వు ఇండస్ట్రీ నుంచి పోయే వరకూ ఉంటావు. నేను చెప్పిన క్యారెక్టర్లు చెయ్ అన్నారు.. ఆ తర్వాత నేను ఆలోచించుకుని సరే చేస్తానని చెప్పాను. ఆ మాట వల్లే నేను ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాను. డేట్స్ కూడా అడ్జెస్ట్ చేయలేనంత బిజీగా మారాను. పగలు రాత్రి పని చేశాను. ఒకే రోజు నాలుగైదు సినిమాలు చేశాను. వీకెండ్ కూడా ఖాళీగా ఉండేదాన్ని కాదంటూ చెప్పుకొచ్చారు నటి సుధ.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.