YS Jagan : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల..!
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విద్యా వ్యవస్థలో పలు ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పేదవాడికి ఉన్నత విద్య కల్పించే రీతిలో.. ప్రభుత్వం తరఫున అనేక పథకాలు అందిస్తూ ఉన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా “అమ్మఒడి” ఇంకా “జగనన్న విద్యా దీవెన” వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం..
నిధులు రిలీజ్ చేసి కాలేజీ యాజమాన్యాలకు.. ప్రయోజనం చేకూరుస్తున్నారు. “జగనన్న విద్యా దీవెన” పథకం కింద ప్రభుత్వం ఎప్పటి నిధులు అప్పుడే అందిస్తుంది. ఐటి, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు.. కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తం క్రమం తప్పకుండా జమ చేస్తుంది. ఈ క్రమంలో నేడు విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి..
“జగనన్న విద్యా దీవెన” పథకం నాలుగో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ త్రైమాసికం నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాలో పడనున్నయి. మొత్తం రూ. 694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. దీనిద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ. 12,401 కోట్లు విడుదల చేసినట్లవుతుంది.