Union Budget 2022 : బిగ్ బ్రేకింగ్.. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ లాంచ్…!
Union Budget 2022 : ఆర్ధిక సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీ ప్రవేశ పెట్టడానికి సిద్దమైంది. డిజిటల్ రూపీని ఈ ఏడాది ప్రవేశ పెడుతున్నట్టుగా కీలక ప్రకటన వచ్చింది. ఈ ఏడాది నుంచి డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ బ్యాంకింగ్ కి మరింత ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.
పోస్ట్ ఆఫీసుల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకోస్తామన్న ఆమె… లక్షా 50 వేల పోస్ట్ ఆఫీస్ లలో నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ సేవలు, ఎటిఎం అందుబాటులో ఉంటాయని చెప్పారు. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం ఇస్తామని అన్నారు. అందుబాటులోకి ఈ పాస్ పోర్ట్ విధానం వస్తుందని పేర్కొన్నారు.

Good News Form Digital currency launch
ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం అందుబాటులోకి వస్తుంది అన్నారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు కేటాయిస్తామని తెలిపారు.