PM Kisan Scheme : గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం త్వరలో రైతులకు డబ్బులు..?
PM Kisan Scheme : దేశంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేస్తున్న అన్ని పథకాలలో “పీఎం కిసాన్ సమ్మాన్ యోజన” ఒకటి. కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి ఈ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు 6000 రూపాయలను పెట్టుబడి సాయంగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతలు అంటే నాలుగు నెలలకు ఒకసారి 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది.
ఈ క్రమంలో “పీఎం కిసాన్ సమ్మాన్ యోజన” పథకంకి.. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది. 2019 నుండి 12 విడుదలగా 24 వేల రూపాయలు అన్నదాత బ్యాంక్ లో కేంద్రం జమ చేసింది. కాకా ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి 20 వరకు 13వ విడత డబ్బులు… రైతుల ఖాతాలో వేయటానికి… కేంద్రం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర pmkisan.gov.in లో తెలియజేయనుంది.
ఈ వెబ్సైట్ ద్వారా అర్హులు కలిగిన రైతులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే 12వ విడత నుండి కేంద్రం ఈ పథకం వర్తింప చేయాలంటే రైతులకు e-KYC తప్పనిసరి చేయడం జరిగింది. గతంలో దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దీనిలో భాగంగా.. “పిఎం కిసాన్ సమ్మన్ యోజన” పథకం ద్వారా రైతులకు మేలు చేకూర్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తూ ఉంది.