Good Job : అదిరిపోయే జాబ్ ఆఫర్.. రోజుకు రూ.1,275, వారానికి 2 రోజులు సెలవులు..!
ప్రధానాంశాలు:
Good Job : అదిరిపోయే జాబ్ ఆఫర్.. రోజుకు రూ.1,275, వారానికి 2 రోజులు సెలవులు..!
Good Job : జాబుల కోసం ఎంతో మంది నిరుద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఒక్క జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందనుకొని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు పలు చోట్ల జాబ్ మేళాలు నడుస్తున్నాయి.ఈ నెల 20 (మంగళవారం) నాంపల్లిలో మెగా జాబ్ మేళా జరగనుంది. పదో తరగతి నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసిన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఇందులో ఫార్మా, హెల్త్, ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్లకు సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొంటున్నాయి. నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగే ఈ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
Good Job పది పాస్ అయితే చాలు..
ఇక గిరిజిన యువతీ యువకుల అభ్యర్థులకు సత్య సాయి జిల్లా కదిరిలో జాబ్ మేళా నిర్వహించబోతున్నారు. సికింద్రాబాద్ కు చెందిన ఎస్‌కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెర్ హౌస్ అసోసియేట్స్ ,పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్,లోడింగ్, అన్లోడింగ్ మొదలైన విభాగాలలో పనిచేయవలసి ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ గిరిజన యువతి యువకుల ఈ నెల 21 న నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చునని తెలిపారు. అయితే విద్యార్హతల విషయానికి వస్తే.. విద్య అర్హతలు: అభ్యర్ధి వయస్సు 18 నుండి 35 సంవత్సరముల మధ్య ఉండాలి. 10వ తరగతి నందు ఉత్తీర్ణత సాధించి, ఇంగ్లీషుపై మంచి అవగాహన ఉండాల్సి ఉంటుంది.
ఇక జీతము వివరములు: నెలకు జీతము రూ.17,000/- నుండి రూ.19,000/- తో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. భోజన, వసతి సౌకర్యములు అభ్యర్థులే భరించాలి. వారములో 5 రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి. రెండు రోజులు సెలవు ఉంటుంది. ఓవర్ టైమ్ క్రింద పనిచేయు వారికి రోజుకు రూ.1,275 ఇవ్వబడును. ఎరుకల, సుగలి,యానాది,గువ్వలలోలు,నక్కలోళ్లు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.వీరు పూర్తి బయోడేటాతో పాటు వారి విద్యార్హత, కుల ధృవీకరణ పత్రము, రేషను కార్డు, ఆధారు కార్డు, పాసుపోర్టు సైజు కలర్ ఫోటోతో పాటు 10వ తరగతి నందు ఉత్తీర్ణత సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రము నకలులను గెజిటేట్ అధికారి వారిచే ధృవీకరించి సదరు బయోడేటాకు జతపరచాలని తెలియజేశారు. ఇతర సమాచారము కొరకు 7981333346,7993864764 నందు సంప్రదించగలరని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.