ఈ యువ మహిళ ఎంపీ జగన్ దృష్టిలో పడింది
MP Mahdavi ఏపీ అధికార పార్టీ వైకాపా నుండి చాలా మంది ఎంపీలే ఉన్నారు. పార్లమెంట్ లో టాప్ 5 పార్టీల్లో వైకాపా నిలిచేంతగా ఆ పార్టీకి ఎంపీలు ఉన్నారు. సంఖ్య భారీగానే ఉన్నా అందులో పని చేసే వారు మాత్రం ఇద్దరు ముగ్గురే. ఎంపీలు అందరికి కూడా బిజినెస్ లు ఉండటంతో నియోజక వర్గం పరిధిలోని సమస్యలు వారికి పట్టడం లేదు. వారు కనీసం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ఎవరి ఇష్టం వారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు పలువురు ఎంపీలపై తీవ్ర కోపంతో ఉన్నారు. అయితే అరకు ఎంపీ గొట్టేటి మాధవి MP Mahdavi మాత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. ఆమె కు పార్టీ అధినాయకత్వం వద్ద కూడా మంచి పేరు దక్కింది.
MP Mahdavi పార్లమెంట్ లో గళం వినిపించింది..
వైకాపా ఎంపీల్లో పలువురు ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి అయినా అధ్యక్షా అంటూ నిలిచింది లేదు కనీసం ప్రశ్న అడిగింది లేదు. కాని మాధవి మాత్రం పలు సార్లు గిరిజన సమస్యలపై మాట్లాడారు. ఆమె విద్యావంతురాలు అవ్వడం వల్ల పలు విషయాలపై పూర్తి అవగాహణ ఉంది. దాంతో ఆమె అన్ని విధాలుగా పార్లమెంట్ లో స్పందించేందుకు ముందు ఉండే వారు. పార్లమెంట్ కమిటీ ల్లో కూడా మెంబర్ గా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇక నియోజక వర్గంలో ప్రజల గురించి ఎప్పుడు ఆమె పరితపిస్తూనే ఉంటుంది. పలు ప్రాంతాలకు కనీస రోడ్లు లేకపోవడంతో తన నిధులను ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేయించింది.
MP Mahdavi జగన్ దృష్టిలో పడింది..
నియోజక వర్గంలో ప్రజలను మరియు కార్యకర్తలను సమన్యయంతో చూసుకుంటూ గ్రామ వాలంటీర్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆమె అభివృద్ది పథంలో తన నియోజక వర్గంను ముందుకు తీసుకు వెళ్లడం పట్ల జగన్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మళ్లీ కూడా ఆమెనే అరకు లో ఎంపీగా గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రతి ఒక్క ఎంపీ కూడా ఆమెను చూసి నేర్చుకోవాలంటూ జగన్ ఇతర ఎంపీలకు సూచించాడట. ప్రజా సమస్యలపై స్పందించని ఎంపీలకు కాస్త ఘాటుగానే సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.