YS Jagan: ఆ మంత్రులకు రోజులు దగ్గర పడ్డట్లే.. నేడో రేపో జగన్ కీలక ప్రకటన?
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు అవుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే మంత్రులను నియమించి వారికి పోర్ట్ పోలియోలను ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి కొందరు మంత్రులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు. మంత్రులను కొందరిని తప్పించి కొత్త వారిని ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడు. తనను నమ్ముకున్న వారికి ఎప్పుడు సాయం చేయాలనుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కొత్తగా అయిదు లేదా ఆరు మందికి తన మంత్రి వర్గంలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక మంత్రి వర్గంలో ఉండి పార్టీ అభివృద్దికి కాని ప్రజల అభ్యున్నతికి కాని ఏమాత్రం పాటు పడని మంత్రులను పీకి పారేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆ మంత్రులకు రోజులు దగ్గర పడ్డాయి
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో ఉన్న ముగ్గురు మంత్రులు మొదటి నుండి పరిపాలనలో నిద్ర పోతున్నట్లుగా ఉండటంతో పాటు జగన్ ఆలోచనలకు తగ్గట్లుగా వారు సాగలేక పోతున్నారట. దాంతో వారిని తొలగిచాలని నిర్ణయించారు. వారికి అదృష్టం కలిసి వచ్చి కరోనా వల్ల మంత్రులుగా మరిన్ని రోజులు కొనసాగుతూ ఉన్నారు. ఏ క్షణంలో అయినా మంత్రులుగా వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఇప్పటికే ఏ మంత్రులను అయితే తొలగించబోతున్నారో ఆ మంత్రులకు మెసేజ్ వెళ్లి పోయినట్లుగా తెలుస్తోంది. వారు ప్రస్తుతం రోజులు లెక్కించుకుంటూ ఉన్నారు. కొత్త మంత్రులు రాబోతున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు తమకు ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అనే ఉద్దేశ్యంతో లాబీయింగ్ చేస్తున్నారట.
రాబోయే ఎన్నికలు లక్ష్యంగా…
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా మంత్రి వర్గ కూర్పును చేయబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సామాజిక వర్గం ప్రాధాన్యత ఆధారంగానే ఈసారి మంత్రి వర్గం విస్తరిస్తారని అంటున్నారు. అన్ని వర్గాల వారికి కూడా ప్రాతినిధ్యంను తన మంత్రి వర్గంలో ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. భారీ గా ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు కొందరు జగన్ చుట్టు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వారి గురించి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.