CM Jagan : సైకిల్స్ తుప్పు పట్టి పోయాయి వీడియో కాన్ఫరెన్స్ లో స్కూల్ పిల్ల సంచలన వ్యాఖ్యలు.. జగన్ నవ్వులు వీడియో వైరల్..!!
CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక చదువు విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓటు హక్కు లేకపోయినా గాని పిల్లలకు మంచి కార్యక్రమాలు ద్వారా భవిష్యత్తుకీ దారి చూపిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యతోపాటు సిబిఎస్సి సిలబస్ తో ప్రభుత్వ బడులలో ఉన్నత విద్య కల్పిస్తున్నారు. మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో జగనన్న గోరుముద్ద పథకం ద్వారా వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే ఆహారాన్ని జగన్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కొంతమంది స్కూల్ విద్యార్థినిలు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. ఒకప్పుడు స్కూళ్లలో టాయిలెట్స్ కి వెళ్లాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని మీరు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయి అని ఓ విద్యార్థిని తెలియజేసింది. ఇప్పుడు టాయిలెట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయని ముఖ్యమంత్రికి తెలియజేసింది. అంతేకాదు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులలో పరిస్థితుల పూర్తిగా మారిపోయాయని పేర్కొంది.
ఇదే సమయంలో ఎనిమిదవ తరగతి పిల్లలకు ఇచ్చిన ట్యాబ్ లు కూడా తమకు కూడా ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో గతంలో తాము వేల కిలోమీటర్ల నుండి వస్తున్న సమయంలో సైకిల్స్ ఇవ్వటం జరిగింది. కానీ ఆ సైకిల్స్ కొద్దిరోజులు తొక్కగానే తుప్పు పట్టి పోయాయి. మీరు వేరే సైకిల్స్ విద్యార్థులకు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ విద్యార్థిని వీడియో కాన్ఫరెన్స్ లో… జగన్ కి తెలియజేయడంతో ఆయన ఒక్కసారిగా నవ్వారు. ఆలోచన చేద్దామని చెప్పుకొచ్చారు.