AP Elections 2023 : ఏపీలో మళ్లీ వైసీపీకే అధికారం.. కేంద్రం చేతుల్లో కీలక రిపోర్ట్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Elections 2023 : ఏపీలో మళ్లీ వైసీపీకే అధికారం.. కేంద్రం చేతుల్లో కీలక రిపోర్ట్.. వీడియో

AP Elections 2023 : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని జగనే అధిరోహిస్తారా? లేక మళ్లీ చంద్రబాబుకు జనాలు అవకాశం ఇస్తారా? లేక కొత్త నాయకులకు అవకాశం ఇస్తారా? అనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. కానీ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. వైసీపీనే ఎలా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :31 March 2023,7:00 pm

AP Elections 2023 : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని జగనే అధిరోహిస్తారా? లేక మళ్లీ చంద్రబాబుకు జనాలు అవకాశం ఇస్తారా? లేక కొత్త నాయకులకు అవకాశం ఇస్తారా? అనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. కానీ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. వైసీపీనే ఎలా అధికారంలోకి వస్తుంది.

ground report on ap elections 2023 video

ground report on ap elections 2023 video

అంత పక్కాగా ఎలా చెబుతున్నారు అంటున్నారా? ఇది మేము చెప్పడం కాదు.. కేంద్ర ప్రభుత్వమే చెబుతున్న మాట. గత రెండు నెలల నుంచి ఏపీ వ్యాప్తంగా బీజేపీ గ్రౌండ్ సర్వే చేయించిందట. దాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలుస్తోందట. బీజేపీ పార్టీ పలువురు ప్రజలు, అధికారులు, ఉద్యోగులు అందరినీ అభిప్రాయ సేకరణ చేయించిందట. ఆయా నియోజకవర్గాల్లో రకరకాల వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యారట. వాళ్ల అంచనా ప్రకారం వైసీపీకే మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఉందట.

Congress Has Sunk' to 'AAP vs BJP': Opinion Pieces on UP, Punjab Election  Results

AP Elections 2023 : బీజేపీ చేయించిన అభిప్రాయ సేకరణ ప్రకారం వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటే?

ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వైసీపీకి 90 నుంచి 96 నియోజకవర్గాలు గెలిచే అవకాశమే ఉంది. మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి.. 90 గెలిచినా కూడా వైసీపీ ఈజీగా గెలుస్తుంది. కానీ.. వైసీపీ బార్డర్ లో గెలిచే అవకాశం ఉండటంతో.. బీజేపీ కొందరు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంటుందా? మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడ కూడా బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తుందా? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. టీడీపీ, జనసేన పొత్తు అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ ఈ సర్వే నిర్వహించింది. కానీ.. జనసేన, టీడీపీతో పోటీ చేయాలని భావిస్తోంది. అప్పుడు రాజకీయాలు మారే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది