Kodali Nani : గుడివాడలో కొడాలి నాని పై టీడీపీ కార్యకర్త సంచలన స్పీచ్ వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: April 17, 2023, 12:00 pm

Kodali Nani : ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కృష్ణాజిల్లాలో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” అనే కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ పార్టీకి చెందిన కుర్రోడు కొడాలి నాని పై సంచలన స్పీచ్ ఇచ్చారు. 20 సంవత్సరాలుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని… అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గుడివాడలో అసలు అభివృద్ధి జరగలేదని ఆ కుర్రోడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: Kodali Nani refuses AP State Development Corporation  Chairman post

కేవలం కొడాలి నాని కుటుంబానికి మాత్రమే లాభం జరిగిందని వ్యాఖ్యానించాడు. ఎమ్మెల్యే సోదరుడికి నియోజకవర్గంలో వందల ఎకరాల చేపల చెరువులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని.. హైదరాబాదులో ఇంటి అద్దెకే కేవలం ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు అంటే నియోజకవర్గం ద్వారా ఎంత దోచుకుంటున్నారో మీరే అర్థం చేసుకోండి అని అన్నారు. గుడివాడలో ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటే రాజేంద్రనగర్ కొడాలి నాని..

gudivada student fires on kodali nani

gudivada student fires on kodali nani

ప్రాంతం ఉండే దగ్గర అది కూడా తన తమ్ముడి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అభివృద్ధి జరిగిందని సెటైర్లు వేశారు. గుడివాడ ప్రజల కోసం కొడాలి నాని చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ మీద అభిమానం అని కామెంట్లు చేసే కొడాలి నాని 2007వ సంవత్సరంలో.. వైఎస్ఆర్ కి వ్యతిరేకంగా పాదయాత్ర చేసింది ఎవరని ప్రశ్నించారు. పదవుల కోసం కొడాలి నాని ఎంతటి మాటలైన మాట్లాడతాడని ఆ టిడిపి కుర్రోడు గుడివాడ సభలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp