
#image_title
Heroine | ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కటి రెండు సినిమాలతోనే స్టార్‌డమ్‌ను సాధించిన ఈ తారలు ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపై కలుసుకుని ఆ గుర్తులను మళ్లీ జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా 90వ దశకంలో దుమ్మురేపిన సినీ తారల రీయూనియన్ గోవాలో ఘనంగా జరగగా, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.
#image_title
ఎవరంటే..
ఈ రీయూనియన్ పార్టీలో సిమ్రాన్, మీనా, సంఘవి, శ్వేతా మీనన్, సంగీత, ఊహ, మహేశ్వరి వంటి టాప్ హీరోయిన్లు పాల్గొన్నారు. అలాగే హీరోలలో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా, దర్శకులుగా శంకర్, కె.ఎస్.రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే వీరిలో ఒక ఫోటో మాత్రం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.ఈ ఫోటోలో సిమ్రాన్, మీనా మధ్య నడుమ కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు… ఒకప్పటి అందాల తార రీమా సేన్. చాలా కాలంగా ప్రజల కంటపడని ఆమె ఒక్కసారిగా ఇలా ప్రత్యక్షం కావడంతో నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
2000ల ప్రారంభంలో దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రీమా సేన్. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సరసన నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమాలో ఆమె నటనకు, జోడీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం ఆమె కెరీర్‌కు పునాది వేసింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.