Heroine | అందాల ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య ఉన్న ఈ హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine | అందాల ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య ఉన్న ఈ హీరోయిన్‌ని గుర్తు ప‌ట్టారా.. !

 Authored By sandeep | The Telugu News | Updated on :10 October 2025,3:00 pm

Heroine | ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్కటి రెండు సినిమాలతోనే స్టార్‌డమ్‌ను సాధించిన ఈ తారలు ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపై కలుసుకుని ఆ గుర్తులను మళ్లీ జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా 90వ దశకంలో దుమ్మురేపిన సినీ తారల రీయూనియన్ గోవాలో ఘనంగా జరగగా, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.

#image_title

ఎవ‌రంటే..

ఈ రీయూనియన్ పార్టీలో సిమ్రాన్, మీనా, సంఘవి, శ్వేతా మీనన్, సంగీత, ఊహ, మహేశ్వరి వంటి టాప్ హీరోయిన్లు పాల్గొన్నారు. అలాగే హీరోలలో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభుదేవా, దర్శకులుగా శంకర్, కె.ఎస్.రవికుమార్, లింగుసామి, మోహన్ రాజా తదితరులు పాల్గొన్నారు. అయితే వీరిలో ఒక ఫోటో మాత్రం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.ఈ ఫోటోలో సిమ్రాన్, మీనా మధ్య నడుమ కనిపిస్తున్న హీరోయిన్‌ను గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు… ఒకప్పటి అందాల తార రీమా సేన్. చాలా కాలంగా ప్రజల కంటపడని ఆమె ఒక్కసారిగా ఇలా ప్రత్యక్షం కావడంతో నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

2000ల ప్రారంభంలో దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రీమా సేన్. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకుని, ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సరసన నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమాలో ఆమె నటనకు, జోడీకి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయం ఆమె కెరీర్‌కు పునాది వేసింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది