Guinness record : టోపీపై 735 ఎగ్స్‌తో వ్యక్తి రికార్డు.. ఎక్కడంటే?

 Authored By praveen | The Telugu News | Updated on :13 October 2021,6:00 am

Guinness record : జనరల్‌గా షాప్ నుంచి ఒకటి లేదా రెండు ఎగ్స్ తీసుకొస్తుంటేనే మనం చాలా జాగ్రత్త పడుతుంటాం. ఎందుకంటే అవి ఎక్కడ పగిలిపోతాయోనని.. ఒకవేళ డజను గుడ్లు తెస్తే ఇంకా చాలా భయపడిపోతాం కదా.. ఇటువంటి తరుణంలో తలపైన టోపీపై 735 ఎగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. భయమేస్తుంది కదా.. అన్ని గుడ్లు అసలు ఎలా బ్యాలెన్స్ అవుతాయి? అవి పగిలిపోతే ఎలా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా.. అది అసలు సాధ్యం కాదనే కంక్లూజన్‌కు కూడా మీరు రావొచ్చు. కానీ, అటువంటి అరుదైన సంఘటన జరిగిందండోయ్..

Guinness Record By 735 Eggs On His Head

Guinness Record By 735 Eggs On His Head

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 735 ఎగ్స్ తలపైన ఉన్న టోపీపై పెట్టుకుని ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఆ ‘ఎగ్ మ్యాన్’ ఎవరంటే.. వెస్ట్ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే పర్సన్ ఈ ఫీట్ చేశాడు. తన తలపై ఉన్న హ్యాట్‌పై అన్ని గుడ్లు పెట్టుకుని రికార్డు సృష్టించాడు. అతడు ఇలా ఎగ్స్ పెట్టుకుని ప్రదర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మొత్తానికి ఇటువంటి వినూత్నమైన ప్రదర్శన ద్వారా గ్రెగరీ దా సిల్వా ‘వరల్డ్ ఫేమస్ ఎగ్ మ్యాన్’ అయిపోయాడు.

praveen

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి