Hero Bike : ఈ బైక్‌ను నెల రోజుల్లోనే రెండు లక్షల మంది కొన్నారు.. మరి దీని ధర, ఫీచర్స్ ఏంటో తెలుసా..?
Hero Bike : దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గడం లేదు. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇ టైంలోనే చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతుండగా, మరి కొందరు ఎక్కువ మైలేజీని ఇచ్చే బైక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇక మన దేశంలో హీరో కంపెనీకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇందులోంచి ఏ కొత్త బైక్ రిలీజ్ అయినా అది ఓ సంచలనమే. ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన బైక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను దేశ వ్యాప్తంగా కేవలం నెల రోజుల్లోనే సుమారు 2లక్షల మంది కొనుగోలు చేశారు.
ఈ బైక్ మైలేజ్ ఎక్కువగా ఉండటంతో పాటు ఫీచర్స్ కూడా బాగుండటంతో చాలా మంది దీనిని కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు సుమారు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.గతంలో కొవిడ్ కారణంగా డల్ అయిన మార్కెట్ ప్రస్తుతం పుంజుకుంటోంది. 2022లో ఈ బైక్ కేవలం నెలరోజుల్లోనే 2 లక్షల కస్టమర్లను సొంతం చేసుకుంది.ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీపై ఆధారపడి నడుస్తుంది ఈ బైక్. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.65 వేలు కాగా.
Hero Bike : దీని ధర సుమారు రూ.70 వేలు
. టాప్ వేరియంట్ బైక్ రూ.70 వేల వరకు ఉంటుంది. మరి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలనుకునే వారు దీని వైపు ఓ లుక్కెయ్యండి మరి. గతం నుంచే హీరో బ్రాండ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులు మెరుగుపడటంతో ఆటోమొబైల్ రంగం కాస్త గాడిలో పడింది. హీరో స్ప్లెండర్ ప్లస్ సృష్టించిన రికార్డును చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇందులోని ఫిచర్సే ఈ రికార్డుకు కారణమని స్పష్టమవుతోంది.