Hansika | హ‌న్సిక విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఈ పోస్ట్‌తో ఫిక్స్ అయిన ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hansika | హ‌న్సిక విడాకుల‌పై వ‌చ్చిన క్లారిటీ.. ఈ పోస్ట్‌తో ఫిక్స్ అయిన ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :29 August 2025,1:00 pm

Hansika | స్టార్ హీరోయిన్‌ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటోందని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2022 డిసెంబర్‌లో హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్‌ని వివాహం చేసుకుంది. అయితే ఇది సోహైల్‌కు ఇది రెండో పెళ్లి. అంతుకు ముందే హన్సిక స్నేహితురాలితో సొహైల్ కు వివాహమైంది.

#image_title

క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

అయితే విడాకులు తీసుకున్నాడు. అయితే ఇప్పుడు హన్సిక, సొహైల్ కూడా విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా వీరు విడివిడిగా ఉంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, అందుకే నటి ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటోందని ప్రచారం జరుగుతోంది.

హన్సిక రీసెంట్‌గా వినాయకుడిని స్వయంగా తన ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం తన ఇంటిని అందంగా డెకరేట్ చేసి పూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. భర్త, మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా పండుగ జరుపుకోవడంతో పాటు మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా దర్శనమిచ్చింది. హిందూ స్త్రీలు, సెలబ్రెటీలు అయినప్పటికీ ప్రత్యేక పర్వదినాల్లో ఖచ్చితంగా మెడలో మంగళ సూత్రం, నుదిటిన సింధూరం లేకుండా ఉండరు. అలాంటిది హన్సిక ఇలా కనిపించడంతో తను భర్త నుంచి దూరమైనట్లుగా, విడాకులపై హింట్ ఇచ్చారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది