Samantha | సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. నా బాధ చూసి నవ్విన వాళ్లున్నారు
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త అడుగు వేసింది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. ప్రస్తుతం సామ్ బాలీవుడ్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సినిమాలో నటిస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ఫేమ్ రాజ్ & డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
#image_title
ఎమోషనల్ కామెంట్స్..
ఇక టాలీవుడ్ వైపు కూడా సమంత కొత్త సినిమాను సిద్ధం చేస్తోంది. దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం.ఇక ఇటీవల సమంత వ్యక్తిగత జీవితంపై కూడా చర్చ నడుస్తోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలోని కష్టాల గురించి మాట్లాడింది. “నా కెరీర్‌లో ఎన్నో ఒడిదొడికులు ఎదుర్కొన్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు నా పరిస్థితి చూసి సంబరాలు చేసుకున్నారు. నవ్వుకున్నారు. నాకు మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. నా విడాకుల సమయంలోనూ కొందరు ఆనందపడ్డారు. అవన్నీ చూసినప్పుడు ఎంతో బాధ వేసింది. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను,” అని సమంత ఎమోషనల్‌గా తెలిపింది.