Hardik Pandya : హార్ధిక్ పాండ్యా కి దెబ్బ మీద దెబ్బ‌… కెప్టెన్సీ పోయింది, పెళ్లాం కూడా అతన్ని వ‌దిలేసి కొడుకుతో జంప్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా కి దెబ్బ మీద దెబ్బ‌… కెప్టెన్సీ పోయింది, పెళ్లాం కూడా అతన్ని వ‌దిలేసి కొడుకుతో జంప్..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Hardik Pandya : హార్ధిక్ పాండ్యా కి దెబ్బ మీద దెబ్బ‌... కెప్టెన్సీ పోయింది, పెళ్లాం కూడా అతన్ని వ‌దిలేసి కొడుకుతో జంప్..!

Hardik Pandya : ఛాంపియ‌న్ క్రికెట‌ర్ హార్ధిక్ పాండ్యా కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. టీమిండియా జెర్సీ వేసుకుంటే రెచ్చిపోయే అత‌డు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏదైనా సరే 200 శాతం న్యాయం చేస్తాడు. ఇటీవ‌ల టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ ద‌క్కేలా చేశాడు. అద్భుత‌మైన బౌలింగ్‌తో క్లాసెన్, మిల్ల‌ర్‌ల‌ని ఔట్ చేసి టీమిండియాకి క‌ప్ ద‌క్కేలా చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా వివాహిక జీవితం విషాదంతంగా ముగిసింది. హార్దిక్ తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించారు. డివోర్స్ విషయాన్ని వీరిద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు.

Hardik Pandya పాపం.. క‌ష్ట కాలం

ఇది తమకు చాలా కఠినమైన నిర్ణయమని, అయితే ఇద్దరూ విడిపోయినా.. తమ మూడేళ్ల కొడుకు అగస్త్య బాధ్యతలను తల్లిదండ్రులుగా కొనసాగిస్తామని తెలిపారు.నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నం చేసాము అని న‌టాషా కూడా ఇదే పోస్ట్ షేర్ చేసింది..అలా న‌టాషా, హార్ధిక్‌ల వైవాహిక జీవితం విషాదంగా ముగిసింది. హార్దిక్ పాండ్యాకు విడాకులకు అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ కూడా ఓ కారణమని అంటున్నారు. నటాషా అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ అనే వ్యక్తితో క్లోజ్‌గా కనిపిస్తూ దర్శనం ఇచ్చింది. హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన తర్వాతే ఆమె అలెగ్జాండర్ అలెక్సిలిక్‌‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని వార్తలు తెర మీదకు వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.దీంతో నటాషా హార్దిక్‌కు దూరం కావడానికి అలెగ్జాండర్ అలెక్సిలిక్‌ కారణమని అభిమానులు భావిస్తున్నారు.

Hardik Pandya హార్ధిక్ పాండ్యా కి దెబ్బ మీద దెబ్బ‌ కెప్టెన్సీ పోయింది పెళ్లాం కూడా అతన్ని వ‌దిలేసి కొడుకుతో జంప్

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా కి దెబ్బ మీద దెబ్బ‌… కెప్టెన్సీ పోయింది, పెళ్లాం కూడా అతన్ని వ‌దిలేసి కొడుకుతో జంప్..!

వ్యక్తిగత జీవితం అలా ఉంటే.. ప్రొఫెషనల్ లైఫ్ మరోలా ఉంది. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతనికి వారసుడిగా హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ కాస్తా మారిపోయింది.టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌కి ఓటేశాడు గంభీర్. త్వరలో జరగనున్న శ్రీలంక టీ20 సిరీస్‌కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్ సాకు చూపి హార్దిక్ పాండ్యాకి మొండిచేయి చూపారు. క‌నీసం వైస్ కెప్టెన్సీ కూడా అత‌నికి ఇవ్వ‌లేదు..దేవుడికి కాస్తా కూడా దయ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది