Harish Rao : ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య రెండు విషయాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ అంశం కాగా.. మరొకటి ఏపీకి చెందిన కార్మికులను తెలంగాణలోనే ఓట్లు తీసుకొని ఏపీలో ఓట్లను రద్దు చేసుకోవాలని సంగారెడ్డి మీటింగ్ లో హరీశ్ రావు చెప్పడం ఏపీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై వరుసగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఏముందని రావాలి అంటూ సవాల్ విసిరారు. వాళ్లకు కౌంటర్ గా హరీశ్ రావు తెలంగాణలో ఏముందో చెప్పుకొచ్చారు. నేనేదో నిన్న మాట వరుసకు అన్నా. సంగారెడ్డి కాడ కొంతమంది ఆంధ్రా నుంచి వచ్చిన మేస్త్రీలు అంతా మేము ఇక్కడే ఉంటాం సార్.
ఓటు రాయించుకున్నాం సార్ అన్నారు నాతోటి. ఓటు రాయించుకుంటే అక్కడ ఓటు.. ఇక్కడ ఓటు ఎందుకు. ఇక్కడే ఉండండి. మీకు ఇక్కడ సవలత్ ఉందా అంటే ఫుల్ సవలత్ ఉంది సార్ అన్నారు. ఇటే ఉండండి అని నేను ఒక మాట అన్నా. ఓ ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్రా మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు. మీ దగ్గర ఏమున్నది తెలంగాణల అంటున్నాడు. ఏమున్నదో వచ్చి చూడు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు. ఏమున్నది అంటున్నవు గదా. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర. మా బోరు బావి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు. ఏమున్నది అంటున్నారు కదా. మా దగ్గర కేసీఆర్ కిట్ పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నది అంటున్నవు కదా.
ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరానికి ప్రతి పంటకు ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు. 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్నాం. ఏమున్నది అంటున్నావు కదా. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది ఈ తెలంగాణలో. ఏమున్నది అంటున్నవు కదా. ప్రపంచమే అబ్బురపడే విధంగా అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. 12 నుంచి 13 జిల్లాలకు సాగునీరు అందించే పథకం ఉన్నది మంత్రి గారు. ఇట్లా చెప్పాలంటే దునియా చెప్పగలుగుతా. మీ దగ్గర ఏమున్నది. ఆ నాడు మీరు.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. ఇవాళ కేంద్రం ప్రత్యేక హోదా ఎగబెడితే ఎవ్వరు కూడా మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా గురించి నోరు మెదుపుతలేరు.. అంటూ హరీశ్ రావు ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.