Haryana News : హర్యానాలో జిలేబి బాబా దారుణం… అత్యాచారం చేస్తూ మహిళలను వీడియో తీస్తూ బుక్ అయ్యాడు..!!
Haryana News : భారతదేశంలో బాబాలకు కొదువ ఉండదన్న సంగతి తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు మొదలుకొని రాజకీయ నాయకులు సైతం ఎక్కువగా బాబాలనే ఆశ్రయిస్తారు. ఎందుకంటే మనదేశంలో చాలామంది భగవంతుని బలంగా నమ్ముతారు. దీంతో ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడానికి సమాజంలో రకరకాల బాబాలు పుట్టుకొస్తూ ఉంటారు. ఇండియాలో వ్యాపారవేత్తల కంటే బాబా అవతారం ఎత్తిన వారి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉంటది. సంవత్సరాలలోనే బ్రాంచీలు కూడా స్టార్ట్ చేసేస్తారు. అంతగా భారతీయులు బాబాలు పట్ల నమ్మకాలు చూపుతారు. ఇదే సమయంలో బాబా ముసుగులో చాలామంది రకరకాలుగా అఘాయిత్యాలకు పాల్పడటం కూడా కనిపిస్తూ ఉంటది.
ఈ తరహా లోనే పంజాబ్ రాష్ట్రంలో మన్సా ప్రాంతంలో జిలేబి బాబా.. అసలు పేరు అమర్ పూరి… అలియాస్ అమరవీర్. 20 సంవత్సరాల క్రితం హర్యానాలో కుటుంబంతో తొహానాకు వచ్చాడు. తొహానా రైల్వే రోడ్డు లో జిలేబి దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో భార్య చనిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయి రెండేళ్ల తర్వాత మళ్లీ ఊరి చేరుకొని తనకు తాంత్రిక విద్య తెలిసింది వాళ్ళకి వీళ్ళకి చెబుతూ జిలేబి బాబాగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత తన వద్దకు వచ్చే అమాయక మహిళా భక్తులను నమ్మించి ధన లాభం కోసం ప్రత్యేక పూజలు యాగాలు చేస్తానని మాయమాటలు చెప్పేవాడు. తాంత్రిక పూజలు చేసే సమయంలో ఆత్మలు ఆవహిస్తాయని ఆ టైంలో ఏం జరుగుతుందో మీకు అసలు అర్థం కాదని… ఏం జరిగినా భరించాలంటూ మహిళలను నమ్మించి వారిని తన దారుణాలకు మానసికంగా సిద్ధం చేసేవాడు.
ఇలా బాబా తన కోరికలు తీర్చుకుంటూ వస్తుండగా…పూజలంటూ ఏవో మత్తు పదార్థాలు ఇచ్చి దాదాపు 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల బయటపడింది. అత్యాచారం చేసే సమయంలో ప్రత్యేకంగా వీడియోలు తీసి సదరు మహిళలకు పంపి డబ్బులకి బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. ఈ క్రమంలో వీడియోలు మొత్తం బయటపడటంతో కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అన్ని విషయాలు వెలుగులోకీ వచ్చాయి. దాదాపు 120 మంది మహిళలపై జిలేబి బాబా అత్యాచారం చేసిన వీడియోలు ఆశ్రమంలో దొరికాయి. ఇదే సమయంలో మత్తు పదార్థాలు సైతం అక్కడ లభించడంతో పలు సెక్షన్ల కింద జిలేబి బాబాపై కేసు నమోదు చేసి… హర్యానా కోర్టులో పోలీసులు హాజరు పరచగా… న్యాయస్థానం బాబాను దోషిగా తేల్చింది.
???? #Haryana’s ‘Jalebi Baba’ convicted under rape charges, sentence to be pronounced today pic.twitter.com/eG69SaTE6N
— MegaNews Updates (@MegaNewsUpdates) January 9, 2023