Categories: NewsTelangana

Heavy Rains : మ‌రో పెద్ద బాంబ్ పేల్చిన వాతావ‌ర‌ణ శాఖ‌.. ఎవ‌రు కూడా బ‌య‌ట‌కు రావొద్దు..!

Heavy Rains : పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింత బలపడే అవకాశం ఉండటంతో, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. విశాఖపట్టణం వాతావరణ కేంద్రం ప్రకారం, రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశముంది.

Heavy Rains | మ‌రో పెద్ద బాంబ్ పేల్చిన వాతావ‌ర‌ణ శాఖ‌.. ఎవ‌రు కూడా బ‌య‌ట‌కు రావొద్దు..!

జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం

వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరం బీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

Recent Posts

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 hour ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

13 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

16 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

17 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

20 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

22 hours ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

1 day ago

Dresses | ఫ్యాషన్‌ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు

Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…

1 day ago