Heavy Rains : మరో పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఎవరు కూడా బయటకు రావొద్దు..!
ప్రధానాంశాలు:
Heavy Rains : మరో పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఎవరు కూడా బయటకు రావొద్దు..!
Heavy Rains : పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింత బలపడే అవకాశం ఉండటంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. విశాఖపట్టణం వాతావరణ కేంద్రం ప్రకారం, రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో విపరీతమైన వర్షాలు కురిసే అవకాశముంది.
జాగ్రత్తలు అవసరం
వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరం బీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.