Hen cock Birthday : గ్రాండ్ గా కోడి పుంజు బర్త్ డే.. నెట్టింట వైరలవుతోన్న బుల్లి పుంజు వేడుకలు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 2, 2022, 8:20 pm

Hen cock Birthday : ఈ రోజుల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ అలవాటే. సిటీ నుంచి పల్లెటూర్ల వరకు ప్రతీ ఒక్కరూ ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుని.. కేకులు, వంటలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇలాగే ఓ ఇంటి వారు తమ ఫ్యామిలీ మెంబర్ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఆ బర్త్ డే తమ కుమారుడో, కూతురిదో కాదు.. ఓ కోడి పుంజుది.

అవునండీ. ఆ ఫ్యామిలీ తమ ఇంటి సభ్యుల్లా అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ బుల్లి కోడి పుంజు బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకకి తమ ఇరుగు పొరుగు వారినందరిని కూడా పిలిచారు. ఆ బుల్లి పుంజును తమ ఒళ్ళో కూర్చో పెట్టుకుని గారాభం చేశారు. ఆ కోడి పుంజుకిది రెండవ బర్త్ డే అని సమాచారం అందుతుండగా.. ఈ తంతు అంతా మన రాష్ట్రంలోనే జరిగింది.

Hen cock Birthday Celebrations went viral in social media

Hen cock Birthday Celebrations went viral in social media

అయితే ఇది ఏ ప్రాంతంలో జరిగింది అనే విషయం మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు. కాగా ఈ కోడి పుంజు బర్త్ డే వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు అంతా ఈ కోడి పుంజుకి హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ కూడా చెబుతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp