Viral Video : పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ.. అతనికి శిక్ష వేయాలంటూ గంగమ్మ హడావిడి.. వీడియో వైరల్..!
ప్రధానాంశాలు:
Viral Video : పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ.. అతనికి శిక్ష వేయాలంటూ గంగమ్మ హడావిడి.. వీడియో వైరల్..!
Viral Video : నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణం, గొల్లగూడెంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్‌కు దారి తీసింది. వివాదానికి కారణం ఒక కోడి అని తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు. స్థానిక మహిళ గంగమ్మ ఫిర్యాదు మేరకు, ఆమె పెంచుతున్న కోడి తన గడ్డివాములో గింజలు తింటోందని కారణంగా రాకేష్ అనే వ్యక్తి కోడిని కర్రతో కొట్టాడు.

Viral Video : పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ.. అతనికి శిక్ష వేయాలంటూ గంగమ్మ హడావిడి.. వీడియో వైరల్..!
Viral Video : కోడి వలన సమస్య..
గట్టిగా కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయని గంగమ్మ ఆరోపించారు. కోడి ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ ఘటనపై గంగమ్మ నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు మొదటిదశలో ఇరువర్గాలను సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, గంగమ్మ మాత్రం రాకేష్‌పై శిక్ష పడాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. “ప్రాణం ఉన్న జంతువును ఎందుకు కొట్టాలి? ఇది నేరం కాదా?” అంటూ గంగమ్మ పోలీసుల ఎదుట గళమెత్తారు.
ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు. కానీ గ్రామస్థుల మధ్య పంచాయతీ స్థాయిలో మొదలైన గొడవ, పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం కోడి పరిస్థితి విషమంగా ఉండగా, పోలీసులు సమగ్ర విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో కోడి పంచాయితీ
కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని గొల్లగూడెంలో తన గడ్డివాములో గింజలు తింటుందని, కర్రతో కొట్టి కోడి కాళ్లు విరగగొట్టిన రాకేష్ అనే వ్యక్తి
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన గంగమ్మ
పోలీసులు సర్దిచెప్పే… pic.twitter.com/I9MssgNZbh
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2025