Home » Exclusive » Hen Lays 11 Eggs In One Day In Kerala
Exclusive

Viral News : ఒక్క రోజులో 11 గుడ్లు పెట్టింది.. ఇది మామూలు కోడి కాదండోయ్..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: June 29, 2021, 9:06 am
Advertisement

Viral News : సాధారణంగా ఒక కోడి రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది.. అని అడిగితే చిన్న పిల్లాడు అయినా సరే.. టక్కున సమాధానం చెబుతాడు. ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది అని చెబుతారు ఎవ్వరైనా. ఎందుకంటే.. ఏ కోడి అయినా సరే.. రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెట్టగలదు. కానీ.. ఒక కోడి మాత్రం ఒక్క రోజులోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 గుడ్లను పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ కోడి ఎక్కడుంది. ఏం తిని అన్ని గుడ్లు పెట్టింది.. అంటారా? అయితే.. పదండి.. ఓసారి కేరళ వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకొని వద్దాం.

Advertisement

hen lays 11 eggs in one day in kerala

అది కేరళలోని కోజికోడ్ జిల్లా కొలతూరు అనే ఊరు. అదే గ్రామానికి చెందిన మనోజ్ కొన్ని రోజుల కింద ఓ కోడిని తెచ్చాడు. తనకు తెలిసిన వాళ్లు ఆ కోడిని ఇచ్చారు. అది కోడి పెట్ట. అంటే.. ఆడది అన్నమాట. అది రోజూ గుడ్లు పెడుతుంటే.. దాన్ని కోసుకొని తినడం ఎందుకు.. గుడ్లు పెడుతుంది కదా.. అని దాన్ని తినకుండా ఉంచేసుకున్నాడు మనోజ్. అయితే.. కొన్ని రోజుల పాటు రోజూ ఒక్క గుడ్డే పెట్టిన ఆ కోడి.. కొన్ని రోజుల తర్వాత రోజుకు రెండు గుడ్లు పెట్టడం ప్రారంభించిందట. ఒక రోజు అయితే ఏకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు 11 గుడ్లను పెట్టేసిందట. కోడి అన్ని గుడ్లను పెట్టడం చూసి మనోజ్ షాక్ అయ్యాడట.

Advertisement

Viral News : కోడిని చూడటానికి ఎగబడుతున్న జనం

వామ్మో.. ఒక్క కోడి.. ఇన్ని గుడ్లు పెట్టడం ఏంటి? ఒక్క రోజులోనే ఇన్ని గుడ్లు పెట్టిన కోడిని ఎక్కడా చూడలేదని.. ఆ కోడిని ఒక్కసారైనా చూడాలని.. అక్కడి స్థానికులు ఆ కోడిని చూడటం కోసం మనోజ్ ఇంటికి క్యూ కడుతున్నారు. అయితే.. దీనిపై నిపుణులను సంప్రదించగా… కోడిలోని హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్లనే అలా కోడి.. ఎక్కువ గుడ్లు పెడుతోందని చెప్పారట. అయితే.. దీని వల్ల కోడికి ఏం ప్రమాదం లేదని నిపుణులు చెప్పారట. ఏది ఏమైనా.. ఒక్క కోడి.. అన్ని గుడ్లు పెట్టి.. మనోజ్ కు కాస్తో కూస్తో సాయం చేస్తోంది.. అని అక్కడి స్థానికులు చెప్పుకుంటున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి