Post Office : పోస్టాఫీస్‌లో పథకాలు.. ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Post Office : పోస్టాఫీస్‌లో పథకాలు.. ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు..

Post Office : పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం పోస్టాఫీస్‌లో మంచి పథకాలు ఉన్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్‌లో మీ డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. చిన్న పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా చేర్పబడింది. ఇందులో వడ్డీ సైతం ఎక్కువగానే లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :28 February 2022,5:00 pm

Post Office : పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం పోస్టాఫీస్‌లో మంచి పథకాలు ఉన్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందొచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. బ్యాంక్‌లో మీ డబ్బు డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. చిన్న పొదుపు పథకాలలో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా చేర్పబడింది. ఇందులో వడ్డీ సైతం ఎక్కువగానే లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీంలో 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు 2020 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తున్నది. ఈ చిన్న మొత్తాల పథకంలో 5.8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

ఈ స్కీంలో డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ రేటుతో పొందొచ్చు. ఇది ఉపయోగకరంగానూ ఉంటుంది. ఇందులో కనీసం నెలకు రూ. వంద పెట్టబడి పెట్టొచ్చు. ఈ ఆర్డీ పథకంలో పెట్టుబడికి గరిష్టంగా ఎలాంటి పరిమితులు లేవు. ఈ పోస్టాఫీసు పథకంలో వయోజన, ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఇలా కాకుండా పథకం కింద మైనర్ తరపున సంరక్షకుడి తరపున గార్డియన్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు.

high interest rate scheme in post office

high interest rate scheme in post office

Post Office : ఐదేళ్లు పొడిగించుకునే ఛాన్స్

10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తన సొంత పేరుపైన ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఈ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఐదేండ్ల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఈ స్కీం కోసం సంబంధిత పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోండి. దీనిని మరో ఐదేండ్ల వరకు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన ఖాతాను ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పథకానికి సంబంధించిన మరింతగా పూర్తి వివరాలు తెలుసుకోండి.. ఖాతా తెరుచుకుని డిపాజిట్ చేసి మంచి వడ్డీ రేటు పొందండి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది