Holidays | నవంబర్‌లో విద్యార్థులకు వరుస సెలవులు.. మరోసారి హాలిడే మూడ్‌లో స్కూళ్లు, కాలేజీలు!

Authored By Sam C | The Telugu News | Published on: November 1, 2025, 3:08 pm

Holidays | దసరా, దీపావళి సెలవుల సందడి ముగిసినప్పటికీ విద్యార్థులు ఇంకా హాలిడే మూడ్‌లోనే ఉన్నారు. అక్టోబర్ నెలలో పండుగలతో పాటు భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వరుసగా సెలవులు లభించాయి. ఇప్పుడు నవంబర్ నెల మొదలవడంతో మరోసారి విద్యార్థులు, ఉద్యోగులు సెలవుల లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నవంబర్ తొలి వారంలోనే వరుస హాలిడేలు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

#image_title

సెల‌వులే సెల‌వులు..

నవంబర్ 2వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు సాధారణ సెలవు. ఆ తర్వాత నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఇదే రోజున గురునానక్ జయంతి కూడా. రెండు పండుగలు ఒకే రోజున రావడంతో చాలా ప్రాంతాల్లో అధికారికంగా హాలిడే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తర్వాతి వారాంతంలో కూడా విద్యార్థులకు విశ్రాంతి లభించనుంది. నవంబర్ 8న రెండో శనివారం , నవంబర్ 9న ఆదివారం . దీంతో ఈ రెండు రోజులు కూడా సెలవులు ఉండటంతో మొత్తం మీద నవంబర్ 2, 5, 8, 9 తేదీల్లో విద్యార్థులకు వరుసగా నాలుగు సెలవులు దక్కుతున్నాయి.

అంతే కాదు, ఈ నెలలో అనధికారిక సెలవులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ “ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్” ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. నవంబర్ 1లోపు బకాయిలు విడుదల చేయకపోతే, నవంబర్ 3 నుంచి నిరవధికంగా విద్యాసంస్థల బంద్‌ చేపడతామని హెచ్చరించింది.ఈ సమ్మె నిజంగా ప్రారంభమైతే నవంబర్‌లో విద్యార్థులకు అదనంగా మరికొన్ని రోజులు సెలవులు రావడం ఖాయం.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp