YS Jagan : పచ్చ ఏడుపు.. వైఎస్ జగన్‌కి మోడీ అపాయింట్‌మెంట్ ఎలా దొరుకుతోందబ్బా.?
YS Jagan : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నాలుగేళ్ళపాటు, బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు కొనసాగింది. కేంద్రంలో టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి అప్పట్లో కేంద్ర మంత్రులుగా పని చేశారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మంత్రులుగా చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసిన సంగతి తెలిసిందే.
అంతలా బీజేపీతో సంబంధాలున్నాగానీ, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం నానా తంటాలూ పడాల్సి వచ్చేది. పలువురు కేంద్ర మంత్రులతో వీలు చిక్కినప్పుడల్లా చంద్రబాబు భేటీలు నిర్వహించేవారు.
వారితో కలిసి ప్రెస్ మీట్లు కూడా నిర్వహించేవారు చంద్రబాబు. కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని ఒప్పంచి లేదా కేంద్రం మెడలు వంచేలా చంద్రబాబు వ్యవహరించలేదన్న విమర్శలున్నాయి. ఓ దశలో చంద్రబాబుకి, ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమయ్యింది. అలాంటిది, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడెలా కావాలనుకున్నప్పుడల్లా ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు.? అన్నది టీడీపీకి అర్థం కాకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే, ‘మాకు మండదా అండీ..’ అంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, ‘పచ్చదళం’ ఏడుపు చూస్తూనే వున్నాం.
అయితే, వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, ఇంకే ఇతర మేలు జరగలేదు.. అన్నదాంట్లో కొంత వాస్తవం లేకపోలేదుగానీ.. క్లిష్ట పరిస్థితుల్లో వున్న రాష్ట్రానికి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చేయడంలో వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలు ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ సమర్థమైన నాయకుడిగా పనిచేస్తున్నారన్న నమ్మకం కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే, ఆంధ్రప్రదేశ్ కోరినట్లుగా అప్పులు చేసుకునే వెసులుబాటు ఎలా కలుగుతుంది.? పచ్చ ఏడుపుకి మరింత ఆజ్యం పోసేలా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతుండడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక భూమిక పోషిస్తున్నారు.