Nano Banana | ‘నానో బనానా’ ఏఐ ఫొటో ట్రెండ్‌పై భయాలు.. చీరకట్టులో పుట్టుమచ్చలతో ఫొటోలు ఎలా వస్తున్నాయి?
Nano Banana | గూగుల్ జెమిని ఆధారంగా పనిచేస్తున్న ‘నానో బనానా’ ఏఐ టూల్ ఓ వైపు వినోదంగా కనిపిస్తున్నా.. మరోవైపు గోప్యతపై భయాలను రేకెత్తిస్తోంది.ఒకప్పుడు చీరల షాపింగ్ కోసం గంటల సమయం కేటాయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, యువతులు సింపుల్ సెల్ఫీని ఏఐకు ఇచ్చి, చీరకట్టులో తమను తాము చూడటం ట్రెండ్ అయింది. ఇదంతా సరదాగా మొదలైనప్పటికీ.. ఇప్పుడు ఇది సీరియస్ చర్చకు దారి తీసింది.

#image_title
పుట్టుమచ్చలు ఎలా వస్తున్నాయంటే?
ఒక యువతి తన సాధారణ ఫొటోను జెమిని నానో బనానా ఏఐ టూల్‌కు అప్‌లోడ్ చేయగా, ఆమె చీరకట్టులో ఉన్న ఫొటోలో అసలు ఫొటోలో కనిపించని పుట్టుమచ్చ కూడా చూపించడమే కాకుండా, అదే స్థలంలో నిజంగా కూడా ఉందని నిర్ధారణ కావడం షాకింగ్‌గా మారింది.అంతేకాదు, పుట్టుమచ్చలు, శరీర ఆకృతి వంటి వ్యక్తిగత అంశాలు కూడా ఏఐ ఫొటోలలో కనిపించడంలో డేటా గోప్యతపై తీవ్రమైన అనుమానాలు మొదలయ్యాయి.
ఏఐకి ఈ సమాచారం ఎక్కడిదీ అంటే మీరు ఏఐ టూల్‌కు ఫొటో ఇచ్చినప్పుడు, అది ఒక్క ఫొటో ఆధారంగా అవతలి ఫొటోను క్రియేట్ చేయదు.మీరు గూగుల్ ఫొటోలు, డ్రైవ్, సోషల్ మీడియాకు ఏదైనా యాక్సెస్ ఇచ్చి ఉంటే.. అక్కడి ఫొటోలను స్కాన్ చేస్తుంది.అంతే కాకుండా, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న మీ ఫొటోలు (ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి) కూడా డేటా ట్రైనింగ్‌కి వాడుతుంది.మీరు గతంలో అప్‌లోడ్ చేసిన ఫొటోల్లో పుట్టుమచ్చలు ఉన్నట్లయితే, ఏఐ వాటిని గుర్తించి కొత్త ఫొటోలోను చూపిస్తుంది.లేదంటే.. ట్రైనింగ్ డేటాలో ఉన్న ఇతరులకు చెందిన ఫొటోలను ఆధారంగా తీసుకుని, అలాంటి ఫీచర్లను భ్రమలో వేస్తుంది.