Janasena : జనసేన ‘ఈ స్థానాల్లో’ 100% గెలుపు.. డౌటే లేదు..!
Janasena : పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి బీజేపీతో పొత్తు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పొత్తు కేవలం ఏపీలోనే చెల్లుబాటు అవుతుందా? లేక తెలంగాణలోనూ ఉంటుందా? అనేదానిపై మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే.. ఎన్నికలు ఎక్కడ వచ్చినా ఏ పార్టీ వాళ్లు ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు తప్పితే రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అని మాత్రం చెప్పలేకపోతున్నారు.ఏపీలో వైసీపీని ఓడించే సత్తా కేవలం బీజేపీకే ఉందంటూ…
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కేవలం బీజేపీ అని మాత్రమే అన్నాడు కానీ.. బీజేపీ, జనసేన కూటమి కలిసి వైసీపీని ఓడిస్తుందని మాత్రం ఆయన చెప్పలేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల గురించి మాట్లాడినప్పుడు అస్సలు బీజేపీ ప్రస్తావనే తేవడం లేదు. వీళ్ల మాటలు బట్టి చూస్తే అసలు బీజేపీతో జనసేనకు పొత్తు ఉందా లేదా అనే డౌట్ అందరిలో తొలుస్తోంది.
Janasena : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్
అదంతా పక్కన పెడితే.. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే.. మునుగోడు ఉపఎన్నికలో మాత్రం పోటీ వద్దని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. కాకపోతే రాబోయే ఎన్నికల్లో మాత్రం జనసేన పలు స్థానాలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే.. తెలంగాణలో ఇంకా పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తోందనేనా పవన్ వ్యాఖ్యల ఉద్దేశం. కట్ చేస్తే మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ.. జనసేన మద్దతును అడగలేదు. కనీసం పవన్ కళ్యాణ్ ను ప్రచారం చేయాలని కూడా అడగలేదు. కానీ.. తెలంగాణలో జనసేన యాక్టివ్ గా ఉన్న దాఖలాలు కూడా లేవు.
అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయాలని భావించినా.. బీజేపీ వద్దని జనసేనను పోటీ నుంచి తప్పించింది. కానీ.. ఇప్పుడు మాత్రం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. కానీ.. తెలంగాణలో జనసేనకు అసలు బలం ఉందా? ఏ నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది… అనే విషయం పవన్ కు తెలుసా? తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలే ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇప్పుడు జనసేన పోటీ చేసి గెలవగలదా? లేదంటే తెలంగాణలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? రెండు పార్టీలు కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.