Jasmine Flowers : మల్లెపూలు ఎక్కువగా పూయాలంటే ఇలా చేయండి…!!
Jasmine Flowers : చిన్నపిల్లాడి మొదలు పెద్దవాళ్ల వరకు సువాసన వచ్చే పూల గురించి చెప్పమంటే మొదటిగా చెప్పే పేరు మల్లెపూలు. సాధారణంగా మల్లెపూలను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే చూడ్డానికి తెల్లగా మంచి పరిమళంతో ఉంటాయి. మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్నవాళ్లు కచ్చితంగా మల్లెతీగను ఇంట్లో పెంచుకుంటారు. కొంతమంది అపార్ట్మెంట్స్ లో ఉంటూ కూడా మల్లి తీగలను లేదా మల్లె చెట్లను చక్కగా పెంచుకుంటూ ఉంటారు. అయితే వచ్చిన చిక్కల్లా చాలామందికి తెలియదు మల్లె చెట్టును ఎలా పెంచుకుంటే ఎక్కువ పూలు పూస్తాయి అని ఇప్పుడు ఆ విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి స్త్రీలు తలలో పూలు పెట్టుకోవడం అనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సంప్రదాయమైన విషయం.
మల్లెపూలను పూల లోనే రాణిగా పిలుస్తుంటారు. అయితే ఎక్కువగా దేవుడికి అలంకరించే మల్లెపూలను ఆడవాళ్ళు ఎందుకు తలలో పెట్టుకుంటారంటే వాటి వాసన వల్ల తల్లి నుంచి బిడ్డకు కావలసిన పాలు ఎక్కువ రోజులు ఉత్పత్తి అవుతాయని అందుకే పూర్వం ఆడవాళ్లు ఎక్కువగా మల్లెపూలను తలలు పెట్టుకునేవారు. ఇక నిద్రలేమితో బాధపడే వారికి కూడా మల్లెపూల వాసన ఓ మెడిసిన్ల పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లె మొక్క ఇక మల్లెపూలు బాగా పూయాలి అంటే నెలకు ఒకసారి వెర్మి కంపోస్ట్ వేయాలి. మల్లె చెట్టుకు ఫాస్ఫరస్ 15 రోజులకు ఒకసారి వేయాలి. ముఖ్యంగా మల్లె చెట్టు నల్ల మట్టిలో బాగా పూస్తాయి. అయినప్పటికీ మన కుండీలో వేసినప్పుడు రాళ్లు రప్పలు లేకుండా ముందుగా మట్టిని శుభ్రం చేసి అప్పుడు కుండి లో వేయాలి.
ఇక ఫాస్ఫరస్ తో పాటు డిఏపి కూడా వేస్తూ ఉండాలి. ఈ డి ఏ పి వల్ల మల్లె చెట్టు వేర్లు దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. చాలామంది మల్లె చెట్టుకు ఆవు పేడను వేస్తూ ఉంటారు. అయితే ఇది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ లో ఆవు పేడను వెయ్యకండి. రూట్స్ డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఈ ఎండాకాలంలో ఆవు పేడను మల్లి చెట్టుకు వేయకండి. దానికి బదులుగా కంపోస్ట్ వేస్తూ ఉండండి. మట్టిలోబాగా కలిపి వెయ్యండి ఆప్పుడు ఆరోగ్యంగా మొక్క ఎదిగి బోలెడు పూలు పూస్తాయి. మల్లెపూలు ఎంత సున్నితంగా ఉంటాయో ఆ మొక్కలు కూడా అంతే సున్నితంగా ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ తీసుకుని మొక్కలను పెంచుకుంటే చాలా చక్కగా మల్లెపూలు చెట్టు అంతే పూస్తాయి. మరి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మీ ఇంట్లో చక్కగా మల్లె మొక్కను ఈ సమ్మర్ లో పెంచుకోండి. మల్లెపూలు పూయించండి…