Mobile Network : ఫోన్ సిగ్నల్ రాకపోతే ఇలా చేయండి… ఈ నాలుగు ట్రిక్స్ పాటిస్తే చాలు ఫుల్ నెట్ వర్క్
Mobile Network : వేలకువేలు పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్లలో నెట్ వర్క్ సిగ్నల్ సరిగా రాలేదంటే చిరాకు పుట్టిస్తుంది.. ఆధారంగానే పనిచేస్తుంది.. ఏదైనా ఫేవరెట్ షో స్ట్రీమింగ్ సమయంలో బ్యాడ్ సిగ్నల్ కారణంగా స్ట్రీమింగ్ బాగా స్లో అయిపోతుంది. దీంతో ఎక్కడలేని కోపం వస్తుంది. ప్రస్తుతం 5జీ కాలం నడుస్తోంది. అయినప్పటికీ చాలా ప్రదేశాల్లో 3జీ 4జీ నెట్ వర్క్ రావడం కష్టమవుతోంది. అయితే బ్యాడ్ సిగ్నల్ కారణంగా ఇంటర్నెట్ వాడలేం.. కాల్స్ మాట్లాడలేం.. ఈ రెండు లేకపోతే ఫోన్ తో మనకు పనిఉండదు. అందుకే ఇలాంటి టైంలో కొన్ని ట్రిక్స్ పాటించి సమస్యను అదిగమిద్దాం..
కొన్నిసార్లు మీ ఫోన్లో నెట్ వర్క్ కవరేజ్ సమస్య ఉన్నప్పుడు అది సెర్చింగ్ నెట్ వర్క్ అలానే కనిపిస్తుంటుంది. సెల్ టవర్ కు కనెక్ట్ కాకపోవడంతో ఫోన్ స్టక్ అయిపోతుంటుంది. వీక్ సిగ్నల్ కనిపిస్తుంటుంది. స్ట్రాంగ్ సిగ్నల్ రావాలంటే మాత్రం ఓసారి సిగ్నల్ రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ పూర్తిగా రీబూటింగ్ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. లేదా ఎరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. కొన్నిసెకన్ల పాటు అదే మోడ్ లో ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేయాలి. దీంతో సిగ్నల్ రీఫ్రెష్ అయి ఫుల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది.అలాగే ఫోన్ ను రిస్టార్ట్ చేయడం వల్ల సిగ్నల్స్ పెరిగే అవకాశం ఉంది. ఫోన్ బయటివైపు ఉండే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ని నొక్కి పట్టాలి.
రిస్టార్ట్ ఆప్షన్ వచ్చిన వెంటనే నొక్కాలి. తర్వాత ఫోన్ రిస్టార్ట్ అవుతుంది. ఇలా చేస్తే కూడా నెట్ వర్క వచ్చే చాన్స్ ఉంది. అలాగే నెట్ వర్క సెట్టింగ్ లను రీ సెంట్ చేయడం వల్ల కూడా సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి రీసెట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని క్లిక్ చేయాలి దీంతో ఫోన్ రిస్టార్ట్ అయిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ వచ్చే చాన్స్ ఉంది.అయితే ఇవన్నీ ట్రై చేసినకూడా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే ఫోన్ నుంచి సిమ్ ని తీసి చెక్ చేయాలి. డ్యామేజ్ అయినట్లయితే కొత్త సిమ్ తీసుకోవాలి. కొత్త సిమ్ ఇన్ స్టాల్ చేయగానే యాథావిధిగా సిగ్నల్స్ కొనసాగుతాయి. మీ ఫోన్స్ లో ఇలాంటి ప్రాబ్లమే ఉంటే మీరు కూడా ట్రై చేయండి మరి…..