Kunda Biryani Recipe : ఎంతో సింపుల్గా కుండ బిర్యాని ఇంట్లోనే చేసుకోండి ఇలా…
Kunda Biryani Recipe : కుండ బిర్యాని చాలామంది తినే ఉంటారు. కొందరు విని ఉంటారు. కొందరు తినే ఉంటారు. బిర్యాని అంటే ఇంట్లో చాలామంది తయారు చేస్తూనే ఉంటారు. కానీ కుండ బిర్యాని కుండలు చేసే బిరియానిని ఎక్కువగా రెస్టారెంట్లలోనే తింటూ ఉంటారు. ఈ కుండ బిర్యాని ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కుండ బిర్యానిలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఇలాంటి కుండ బిర్యాని ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుందాం ఇలా… కావలసిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పెరుగు, కారం, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, నిమ్మరసం, గరం మసాలా, మిరియాల పొడి, నూనె, బాస్మతి బియ్యం, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, అనాసపువ్వు, జాజికాయ, మరాఠీ మొగ్గ, పుదీనా, మొదలైనవి.
తయారీ విధానం: ముందుగా బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్స్ను బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు బ్రౌన్ ఆనియన్ లాగా వేయించుకోను పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చికెన్ తీసుకుని దానిలోకి ఒక కప్పు పెరుగు, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు స్పూన్ల నిమ్మరసం రెండు స్పూన్ల ఉప్పు కొంచెం మిరియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్లో నీళ్లు వేసి దానిలో బిర్యానీ ఆకు, అనాసపువ్వు, జాజికాయ పొడి, మరాఠీ మొగ్గ, లవంగాలు, రెండు యాలకులు, కొంచెం ఉప్పు, ఒకటి దాల్చిన చెక్క వేసి కొంచెం నెయ్యి కూడా వేసి బాగా మసల కాగనివ్వాలి. అవి ముసలా తాగిన తర్వాత ఈ బియ్యాన్ని వేసి 70% ఉడకనివ్వాలి. ఒకపక్క మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని పెట్టుకొని 80% ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత దానిలోకి 70% ఉడికిన అన్నం తీసి దానిలో వేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్ కొంచెం పుదీనా కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి గాలి చోరకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే ఎంతో సింపుల్ గా ఇంట్లోనే కుండ బిర్యాని రెడీ..