Chicken Shami Kabab : ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షమీ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
Chicken Shami Kabab : చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్ కచ్చితంగా ఉండాల్సిందే కొందరికి. మరికొందరికి అయితే ప్రతీ రోజూ కావాల్సిందే. ముక్క లేనిదే ముద్దు దిగదంటారు. అయితే అలాంటి వారికి చికెన్ తోనే వెరైటీ వెరైటీ వంటకాలు కావాలి. అయితే ఇలా ప్రతీ రోజూ బయటకు వెళ్లి తనడం వీలు కాదు కాబట్టి ఇంట్లోనే చికెన్ తో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. అయితే అందులో ఎక్కువగా ఇష్టపడేది చికెన్ కబాబ్.
కబాబ్స్ అంటే ఉత్తి కబాబ్స్ యే కాదండోయ్ చికెన్ షమీ కబాబ్… అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు.. పావు కిలో చికెన్, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుడ్డు, ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, కట్ట కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఒక పచ్చిమిర్చి, 150 గ్రాముల సెనగ పప్పు.తయారీ విధానం… ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో చికెన్, చనా మసాలా, పచ్చి మిర్చి, కొబ్బరి పొడి, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
చికెన్ ఉడికిన తర్వాత అది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటిని ఒక జార్లో వేసి అందులో గుడ్డు కూడా వేసుకొని మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న టిక్కీస్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ షమీ కబాబ్స్ రెడీ. మీకిష్టమైన చికెన్ ప్రియులకు ఈ షికెన్ షమీ కబాబ్స్ ని ఒక్కసారి మీ చేత్తో చేసి తినిపించారంటే ప్రతిరోజూ కావాలని వెంట పడతారు.