Underarm odor | చంకల దుర్వాసనపై ఇంటి నివారణలు.. ఇకపై డియోడరెంట్ల అవసరం లేకపోవచ్చు!
Underarm odor | చలికాలమో, వేసవినో సంబంధం లేకుండా… చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉండే సమస్య చంకల దుర్వాసన. ఈ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు చాలామంది డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు వాడుతుంటారు. అయితే ఇవి కేవలం కొన్ని గంటల వరకే ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలికంగా వాసనను నివారించాలంటే, ఇంటి చిట్కాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

#image_title
ఇప్పుడు మనం ఇంట్లోనే సులభంగా చేసుకునే సహజ పరిష్కారాలు ఏవో తెలుసుకుందాం
బంగాళాదుంప రసం
బంగాళాదుంపలు చర్మానికి సహజ శుద్ధికరంగా పనిచేస్తాయి.
విధానం:
బంగాళాదుంపను తురుముకుని, దాని రసాన్ని పిండి తీసుకోవాలి
ఒక దూదిలో ముంచి చంకలకు అప్లై చేయాలి
అరగంట పాటు ఉంచి, ఆపై నీటితో కడిగేయాలి
ఇది బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది.
కలబంద (అలోవెరా) జెల్
కలబందలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి.
విధానం:
తాజా అలోవెరా జెల్‌ను చంకలకు అప్లై చేయండి
20–25 నిమిషాలు ఉంచి కడిగేయండి
రోజులో రెండుసార్లు చేయవచ్చు
అదనంగా, ప్రతిరోజూ స్నానం సమయంలో యాంటీబ్యాక్టీరియల్ సబ్బు ఉపయోగించాలి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల, ఇది చంకల శుభ్రతకు బాగా పనిచేస్తుంది.
విధానం:
కొబ్బరి నూనెను చంకలపై మర్దన చేయాలి
15–20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత కడిగేయాలి
ఇది చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది.
బేకింగ్ సోడా & నిమ్మరసం
ఈ కలయిక బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధించి, చర్మాన్ని డియోడరైజ్ చేస్తుంది.
విధానం:
2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా
1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి
చంకలపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి