Theertham : గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేశారో.. దరిద్రం మీ నెత్తి మీద కూర్చున్నట్టే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Theertham : గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేశారో.. దరిద్రం మీ నెత్తి మీద కూర్చున్నట్టే..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :20 May 2021,12:08 pm

Theertham : హిందూ దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కొబ్బరి కాయలు కొట్టడం సహజం. ఆ తర్వాత దేవుడిని మొక్కుకొని కోరికలు కోరుకున్నాక.. దేవుడికి అర్చన చేయించడం.. ఆ తర్వాత పూలు, పండ్లు దేవుడికి సమర్పించడం ఆనవాయితీ. ఆ తర్వాత పూజారి దేవుడికి హారతి ఇచ్చాక.. శఠగోపం పెట్టి.. అప్పుడు గుడికి వచ్చిన భక్తులందరికీ తీర్థాన్ని అందిస్తాడు. తీర్థం అంటే అది దేవుడికి అభిషేకం చేసిన మంచి నీళ్లు కావచ్చు.. కొబ్బరి నీళ్లు కావచ్చు.. ఇంకా పంచామృతాలు అయినా కావచ్చు. ఏది ఏమైనా.. గుడికి వెళ్లినప్పుడు.. దేవుడిని దర్శించుకున్న తర్వాత పూజారి ఖచ్చితంగా అందరికీ తీర్థ ప్రసాదాలను అందిస్తాడు. అది ఏ గుడిలో అయినా ఉంటుంది. గుడి పూజారి తీర్థాన్ని ఇవ్వగానే చాలామంది దాన్ని తాగాక.. కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. నిజానికి.. తీర్థం అనేది చాలా పవిత్రమైన జనం. దానిలో ఎన్నో సుగుణాలు ఉంటాయి.

how to take theertham in temple devotional tips telugu

how to take theertham in temple

గుడిలో తీర్థాన్ని తాగితే ఎన్నో రోగాలు నయమవుతాయట. అందుకే.. చాలామంది గుడికి వెళ్లినప్పుడు తీర్థం పుచ్చుకోకుండా బయటికి రారు. అయితే.. చాలామంది తెలియక తీర్థం పుచ్చుకున్నాక తీర్థం పుచ్చుకున్న చేయిని అలాగే తల మీదికి తీసుకెళ్లి.. తల మీద ఉన్న జుట్టుకు చేతిని రుద్దేస్తుంటారు. అలాంటి పనులు చాలామంది చేస్తుంటారు. కానీ.. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పండితులు చెబుతున్నారు. ఇంతకీ.. తీర్థం పుచ్చుకున్నాక ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Theertham : తీర్థం పుచ్చుకున్నాక.. ఎంగిలి చేయిని తల మీద రుద్దుకోకుండా ఏ చేయాలి?

Theertham

Theertham

తీర్థం పుచ్చుకోగానే.. చేయి ఎంగిలి అవుతుంది. అప్పుడు ఆ చేయిని తల మీద పెట్టి రుద్దుకుంటే.. దరిద్రాన్ని ఆహ్వానించినట్టే. ఎందుకంటే.. గుడిలో పూజారులు తీర్థాన్ని పంచామృతాలతో చేస్తారు. అప్పుడు దాంట్లో చెక్కర, తేనె కూడా కలుపుతుంటారు. అలాగే తులసి తీర్థాన్ని కూడా పూజారులు అందిస్తుంటారు. ఇలా ఏ తీర్థం అయినా సరే.. దాన్ని తలకు రాసుకోకూడదు. అలా చేస్తే.. దరిద్రం పట్టుకుంటుంది. మంచి ఫలితాలు ఉండవు. గుడికి వెళ్లి కోరుకున్న కోరికలు కూడా నెరవేరవు అని శాస్త్రం చెబుతోంది. అందుకే తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేయిని నీటితో కడుక్కోవాలి. లేదంటే.. ఏదైనా రుమారు లేదా కండువా ఉన్నా.. దానితో చేయిని తూడ్చుకోవాలి కానీ నెత్తి మీద మాత్రం రుద్దుకోవద్దు అని పండితులు చెబుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది