TRS : ఏమాత్రం అదమరిచినా టీఆర్ఎస్ కు భవిష్యత్తులో కష్టాలే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : ఏమాత్రం అదమరిచినా టీఆర్ఎస్ కు భవిష్యత్తులో కష్టాలే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :10 April 2021,9:45 am

TRS : టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ. అయినా కూడా పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో రాణించాలన్నా.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్నా… కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే… తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఓవైపు బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. మరోవైపు షర్మిల పార్టీ పెడుతున్నారు. కాంగ్రెస్ కూడా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఒక అధికార పార్టీగా టీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సీఎంగా కేసీఆర్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం చాలా సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. అయితే… కానీ… ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇతర కీలక నేతలు కృషి చేయాలి. ఎందుకంటే… అధికార పార్టీగా టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తోందనేది ప్రజలకు తెలియకపోతే ఎట్లా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేయాలి.

TRS Party

TRS Party

ఇవన్నీ పక్కన పెడితే… పార్టీలో అంతర్గతంగా ఉండే సమస్యలపై కూడా పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలోని కొందరు కీలక నేతలు…. పార్టీ మారడానికి చూస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నుంచి వేరే పార్టీలో చేరడం అంటే అది నిజంగా పార్టీకి మాయని మచ్చే. ఆ మచ్చను రాకుండా చేసుకునేందుకు పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ముందుకు వెళ్లాలి. లేకపోతే… పార్టీపై ప్రజల్లో చులకన భావం వచ్చే అవకాశం ఉంది.

TRS : బీజేపీ బలపడితే టీఆర్ఎస్ కు కష్టమే?

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడుతోంది. బీజేపీ నేతలు కూడా పార్టీని బలంగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పార్టీని చాలా సునాయసంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. దీని వల్ల టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. నిజానికి ఇది రాజకీయ పార్టీ కాదు. కానీ..  తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ పార్టీగా మారాల్సి వచ్చింది. కేవలం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి… తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే…. పార్టీ అధిష్ఠానం, కీలక నేతలు… చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది