Railway jobs : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. రైల్వేలో భారీగా ఉద్యోగావకాశాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Railway jobs : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. రైల్వేలో భారీగా ఉద్యోగావకాశాలు

Railway jobs : దేశవ్యాప్తంగా ఉద్యోగం కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తయి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న వారికి తాజాగా ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారికి జాబ్ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మొత్తం 2422 ఉద్యోగల ఖాళీలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్లు ఉద్యోగ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :22 January 2022,12:30 pm

Railway jobs : దేశవ్యాప్తంగా ఉద్యోగం కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. చదువు పూర్తయి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న వారికి తాజాగా ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన వారికి జాబ్ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మొత్తం 2422 ఉద్యోగల ఖాళీలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి అర్హులుగా తెలిపింది.ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, టర్నర్, వెల్డర్,

షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్, పెయింటర్, మెషినిస్ట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం సాధ్యమవుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగల ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు త్వరితగతిన దరఖాస్తు చేసుకుంటే బెటర్..పది తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం. https://www.rrccr.com/వెట్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Huge job opportunities in railways education iti

Huge job opportunities in railways education iti

Railway jobs : ఐటీఐ, పదో తరగతి విద్యార్థులకు తొలి ప్రాధాన్యత..

 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేది ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదిగా ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిత వేతనం లభించనుంది. ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు మేలు కలిగేలా ఇండియన్ రైల్వే వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల అవుతుండటం గమనార్హం.

Tags :

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది