Home » Exclusive » Hungry Elephant Video Viral In Thailand
Exclusive

Viral Video : ఎంత ఆకలి వేస్తే మాత్రం ఇంత రచ్చనా? ఇంట్లోకి దూరి ఏనుగు చేసిన రచ్చ మీరే చూడండి..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: June 26, 2021, 12:00 pm
Advertisement

Viral Video : ఏనుగు.. అనేది చాలా పెద్ద ఆకారంలో ఉండే జంతువు. నిజానికి అది మనుషులకు హాని తలపెట్టదు. తన పనేదో తాను చేసుకుంటుంది. దాన్ని గెలికితేనే అసలు సమస్య. తన అసలు స్వరూపం బయటపడుతుంది. ఏనుగులకు కోపం వస్తే ఎలా రచ్చ చేస్తాయో అందరికీ తెలుసు కదా. అవి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్లి తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వాటికి కోపం రాకుంటే ఏం కాదు కానీ.. కోపం వస్తేనే అసలు సమస్య. అందుకే.. ఏనుగులు ఎక్కడ కనిపించినా వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ వాటిని ఏమైనా అంటే ఇక అంతే.. అక్కడ సర్వనాశనం కావాల్సిందే. వాటి కోపానికి బలి కావాల్సిందే.

Advertisement

Hungry Elephant video viral in thailand

ఇప్పుడు మనం ఏనుగుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. ఓ ఏనుగు చేసిన రచ్చ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అది చేసిన రచ్చ గురించి తెలిస్తే మీరే నోరెళ్లబెడతారు. ఇంతకీ ఏమైందో తెలుసా? ఓ ఏనుగుకు తెగ ఆకలి వేసింది. ఏం చేయాలో కూడా దానికి అర్థం కాలేదు. దీంతో ఓ ఊళ్లోకి వెళ్లింది. ఇంకా తన ఆకలి ఎక్కువైంది. ఇక ఆగలేక.. ఓ ఇంట్లోకి దూరిపోయింది. కిచన్ గది కిటీకిని పగులగొట్టేసింది.

Advertisement

Viral Video : కిచెన్ గదిలోకి దూరి ఆహారం కోసం వెతుకులాట

కిచెన్ గదిలోకి దూరిన ఏనుగు.. ఆహారం కోసం వెతికింది. చివరకు తనకు ఓ బియ్యం బస్తా కనిపించడంతో ఆ బియ్యం బస్తాను తన తొండంతో పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సడెన్ గా కిచెన్ కిటికీని బద్దలు కొట్టి.. ఏనుగు కిచెన్ లోకి వచ్చి చేసిన రచ్చ చూసి ఆ ఇంటి వాళ్లు ఆశ్చర్యపోయారు. దాన్ని వెళ్లగొట్టే సాహసం చేయలేక అది చేసే రచ్చను చూసి అలాగే వీడియో తీస్తూ ఉండిపోయారు. ఈ ఘటన థాయ్ లాండ్ లోని హువాహిన్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి