Husband Catch Wife Red Handed In Room : ప్రియుడి తో ఏకాంతగా గడుపుతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త..ఆ తర్వాత ఏంజరిగిందంటే !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband Catch Wife Red Handed In Room : ప్రియుడి తో ఏకాంతగా గడుపుతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త..ఆ తర్వాత ఏంజరిగిందంటే !!

 Authored By sudheer | The Telugu News | Updated on :5 February 2026,11:10 am

Husband Catch Wife Red Handed In Room : దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. భర్త , భార్య , పిల్లలు ఉఉన్నప్పటికీ పలువురు అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చటి సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు. ప్రతి రోజు ఇలాంటి సంబంధాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక మహిళ తన ప్రియుడితో కలిసి హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతుండగా, ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వీరిద్దరినీ గది నుంచి బయటకు లాగి నిలదీయడంతో హోటల్ ఆవరణలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఈ హైడ్రామాను అక్కడ ఉన్న వారు వీడియో తీయడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Husband Catch Wife Red Handed In Room ప్రియుడి తో ఏకాంతగా గడుపుతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్తఆ తర్వాత ఏంజరిగిందంటే

Husband Catch Wife Red Handed In Room : ప్రియుడి తో ఏకాంతగా గడుపుతుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త..ఆ తర్వాత ఏంజరిగిందంటే !!

ఒంటరితనాన్ని భరించలేకనే మరో వ్యక్తితో ప్రేమ

అయితే, భర్త తనను నిలదీస్తున్న సమయంలో ఆ మహిళ ఏమాత్రం తలవంచకుండా చేసిన వాదనలు అక్కడి వారిని విస్మయానికి గురిచేశాయి. గత రెండేళ్లుగా తన భర్త తనతో కలిసి ఉండటం లేదని, తనను పట్టించుకోవడం లేదని ఆమె బహిరంగంగా ఆరోపించింది. తన ఒంటరితనాన్ని భరించలేకనే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని, ఇందులో తప్పేముందని ఆమె ఎదురుదాడికి దిగింది. చుట్టూ జనం గుమిగూడి ప్రశ్నలు వేస్తున్నా వెనక్కి తగ్గకుండా, తన వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆమె చేసిన వాదనలు భార్యాభర్తల బంధంపై జరుగుతున్న చర్చను మరింత ముదిరేలా చేశాయి.

పచ్చటి సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చు

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఘర్ కే కలేష్’ అనే ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోను చూసి కొందరు “పచ్చటి సంసారంలో ఇలాంటి వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి” అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆ మహిళ వాదనను సమర్థిస్తున్నారు. భర్త తోడు లేనప్పుడు ఆమె వేరొకరిని ఆశ్రయించడంలో ఆశ్చర్యం లేదని కొందరు అంటుంటే, నమ్మకద్రోహం ఏ రూపంలో ఉన్నా తప్పేనని మెజారిటీ నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి ఈ ఉదంతం సామాజిక విలువలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి