Retired Soldier kills wife : హైదరాబాద్, మీర్‌పేట ప్రాంతంలో భార్యను చంపిన భర్త కేసులో ఒళ్లు గగుర్పాటు పొడిచే విషాలు వెలుగులోకి వచ్చాయి. నేరం చేసిన తీరు మనిషిలోని క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి బహిర్గతపరిచింది. ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి, వెంకటమాధవి దంపతులు. 13 ఏండ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. కంచన్‌బాగ్ డిఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.
తనకు భార్య మీద అనుమానం తలెత్తింది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. రిఫరెన్స్ కోసం యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియా సైట్లలో సెర్చ్ చేశాడు. ముందుగా రిహార్సల్స్ కోసం కుక్కను చంపాడు. అనంతరం భార్యను చంపాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా భార్య బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు ఇచ్చాడు. కాగా భార్యను చంపిన అనంతరం గురుమూర్తి డెడ్ బాడీని మాయం చేసిన తీరు క్రైం, హారర్ మూవీని మించి ఉండడంతో అంతా వణికిపోయారు.
డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మొదటగా ముక్కలుగా నరికాడు. అనంతరం ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి కుక్కర్‌లో ఉడికించాడు. ఎముకలను కాల్చి, ఆపై దంచి పొడి చేసి జిల్లెలగూడ చెరువులో కలిపేశాడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. గురుమూర్తి పైనే అనుమానం కలుగడంతో అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారించగా జరిగిన దారుణం వెలుగుచూసింది.
Mahesh Babu SS Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు Mahesh Babu రాజమౌళి SS Rajamouli కాంబినేషన్…
PM Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ Andhra pradesh విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీకి కావాల్సిన…
Varun Tej Prabhas : ఈ మధ్య యువ హీరోలు విలన్ పాత్రలలో కనిపిస్తూ మెప్పిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
New ration cards : అర్హులైన అన్ని కుటుంబాలకు న్యాయమైన ఆహార భద్రత కల్పించడానికి Telangana Govt తెలంగాణ ప్రభుత్వం…
Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు Ram Gopal Varma ముంబై కోర్ట్…
Narayana College : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh అనంతపురంలోని Anathapuram Narayana College నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్‌లో…
Blood Sugar : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కూరగాయలను ప్రతిరోజు తినాలి. మాంసాహారం కన్నా కూరగాయల భోజనం మిన్న.…
It Raids : ఇన్‌కంటాక్స్ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌వీసీ, మైత్రి , మ్యాంగో మీడియా…
This website uses cookies.