Affair : రెంట్ ఉన్న అబ్బాయి ఆంటీతో ఎఫైర్‌.. స‌డ‌న్‌గా అంకుల్ ఎంట్రీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Affair : రెంట్ ఉన్న అబ్బాయి ఆంటీతో ఎఫైర్‌.. స‌డ‌న్‌గా అంకుల్ ఎంట్రీ..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Affair : రెంట్ ఉన్న అబ్బాయి ఆంటీతో ఎఫైర్‌.. స‌డ‌న్‌గా అంకుల్ ఎంట్రీ..!

Affair : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్‌ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టడం అంద‌రు ఉలిక్కి ప‌డేలా చేసింది. హర్యానాలోని చక్రి దాద్రిలో జరిగిన ఈ ఘ‌ట‌న గురించి చూస్తే… బాధితుడు జగదీప్ రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది.

Affair రెంట్ ఉన్న అబ్బాయి ఆంటీతో ఎఫైర్‌ స‌డ‌న్‌గా అంకుల్ ఎంట్రీ

Affair : రెంట్ ఉన్న అబ్బాయి ఆంటీతో ఎఫైర్‌.. స‌డ‌న్‌గా అంకుల్ ఎంట్రీ..!

Affair స‌జీవంగా స‌మాధి..

నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి జ‌గ‌దీప్‌ని సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత జగదీప్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. అయితే పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 24న జగదీప్‌ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు.

జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్‌దీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితులపై హత్య, అపహరణ, కుట్ర అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది