Husband Wife : భార్య ఫోన్ కాల్స్ విని 14.5 కోట్లు సంపాదించిన భర్త... అంతలోనే ఊహించని బిగ్ ట్విస్ట్..!
Husband Wife: స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే..అనుభవజ్ఞులైన వారు స్టాక్ మార్కెట్ ద్వారా కోట్లలో సంపాదిస్తూ ఉంటారు. ఇక ఎలాంటి అనుభవం లేకుండా స్టాక్ మార్కెట్ లోకి దిగిన వారు మాత్రం సర్వం కోల్పోవడం ఖాయమని చెప్పాలి. అలాంటి స్టాక్ మార్కెట్ ను ఓ వ్యక్తి అడ్డదారి ఎంచుకుని దాదాపు 14.5 కోట్లు సంపాదించాడు. కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే…అమెరికాకు చెందిన టైలర్ లోడాన్ అనే వ్యక్తి భార్య బ్రిటిష్ పెట్రోలియం లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆమె ఇంటి వద్ద నుండి వర్క్ చేస్తూ ఉంటారు. అయితే భార్యకు తెలియకుండా భర్త లోడాన్ ఆమె ఫోన్ కాల్స్ విని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి 1.76 మిలియన్ డాలర్లు అంటే 14 కోట్ల 50 లక్షల రూపాయలు అర్జించారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ టెక్స్ట్ ఈసీ తెలిపింది.ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికాను చమురు సంస్థ అయినటువంటి బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ తాజాగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించిన సంభాషణలు ఫోన్ కాల్స్ విని లోడాన్ ట్రేడింగ్ చేశారని అమెరికా టెస్ట్ ఈసీ తెలిపింది. అయితే ఇక్కడ భార్య నమ్మకాన్ని ఉపయోగించుకుని లోడాన్ ఆమె దగ్గర గోప్యమైన సమాచారాన్ని సంపాదించి దాని నుంచి లాభం పొందారు అనే విషయాన్ని సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తెలియజేయడం జరిగింది.
అయితే లోడాన్ భార్య బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో మేనేజర్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ట్రావెల్ సెంటర్స్ ను బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఆమె కూడా భాగస్వామిగా ఉన్నారు. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో ఈ డీల్ గురించి అధికారిక ప్రకటన రాకముందే లోడాన్ తన భార్యకు తెలియకుండా ట్రావెల్ సెంటర్స్ స్టాక్స్ లోని 46,450 షేర్లను కొనుగోలు చేశాడు. అయితే అధికారిక ప్రకటన తర్వాత ట్రావెల్ సెంటర్స్ ధర దాదాపు 71 శాతం పెరగడం జరిగింది. దీంతో లోడాన్ తాను కొనుగోలు చేసిన అన్ని షేర్ లను విక్రయించాడు. అయితే 2022లో ట్రావెల్ సెంటర్స్ బీపీ కంపెనీల మధ్య డీల్ గురించి చర్చలు జరగాయి. ఇక ఆ సందర్భంలో దంపతులు ఒకరికొకరు పనికి సంబంధించిన సంభాషణలు వీడియో కాన్ఫరెన్స్ లు విన్నారని సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ కమిషన్ పేర్కొంది.
బీపీ డీల్ గురించి మరియు ట్రావెల్స్ సెంటర్స్ షేర్ లపై ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ రెగ్యులేటర్ అథారిటీ అనుమానించి లోడాన్ ను ప్రశ్నించడంతో ఆయన తన తప్పును ఒప్పుకున్నారట. తన భార్య ఎక్కువకాలం పనిచేయకుండా ఉండాలని దానికి తగినంత డబ్బు సంపాదించుకోవాలనుకున్నానని అందుకే షేర్ లను కొనుగోలు చేసినట్లుగా విచారణలో లోడాన్ చెప్పుకొచ్చారు. అయితే లోడాన్ చేసిన పని చూసి ఆమె భార్య కూడా షాక్ అయ్యారు. అయితే భార్య కావాలని భర్త లోడాన్ కి ఈ సమాచారాలు అందించి ఉంటుందనే అనుమానంతో బీపీ కంపెనీ ఆమెకు సంబంధించిన వివరాలన్నీ అనాలసిస్ చేయగా ఎక్కడ కూడా ఆమె తన భర్తకు సమాచారాన్ని లీక్ చేసినట్లుగా ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ కూడా బీపీ కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్టాక్ మార్కెట్ వర్గాలలో తీవ్ర చర్చానీయంశం గా మారింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.