Huzurabad bypoll : హుజూరాబాద్ బరిలో భార్యాభర్తలు.. ఈటల భార్య కూడా రంగంలోకి…?
Huzurabad bypoll ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడోసారి కూడా గెలిచి తీరాలనే పట్టుదల. అవమానకరంగా మెడబట్టి గెంటేసిన తెలంగాణ Telangana సీఎం కేసీఆర్ KCRకు.. గెలిచి గట్టి గుణపాఠం చెప్పాలనే పంతం. తన సొంత బలం సరిపోదనుకున్నారో ఏమో.. బీజేపీలో చేరి కమలనాథులను సైతం తోడేసుకొని కేసీఆర్ KCR పై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక తన గెలుపు ఈజీ అనుకుంటున్నంతలోనే.. అనుకోని ఉపద్రవం రేవంత్‌రెడ్డి రూపంలో వచ్చిపడింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి Revanth reddy నియామకంతో సమీకరణాలు మళ్లీ తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినా, గెలుపుపై ధీమా వదలకుండా.. మరింత పట్టుదలతో పోరాడుతున్నారు ఈటల రాజేందర్ Etela rajendar. నియోజక వర్గంలో పాదయాత్రతో మరింత పట్టుకు ప్రయత్నిస్తున్నారు. ఈటల రాజేందర్ ఇంతగా చెమటోడుస్తుండగా.. ఈటల రాజేందర్ Etela rajendar తో పాటు సమానంగా ఆయన సతీమణి జమునారెడ్డి సైతం హుజురాబాద్ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తుండటం ఆసక్తికరం.
పోటీలోనూ కలిసి అడుగులు Huzurabad bypoll
ఇన్నాళ్లూ ఈటల రాజేందర్ Etela rajendar కు తోడుగా ఇంటింటి ప్రచారంతో పాటు రాజకీయ మంత్రాంగాలు సైతం నెరపిన ఈటల జమున రెడ్డి.. తాజాగా, హుజురాబాద్‌లో నామినేషన్‌కు సైతం రెడీ అవుతుండటం ఆసక్తికర పరిణామం. బీజేపీ BJP అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ బరిలో దిగుతున్నారు కదా.. మరి, జమునారెడ్డి Etela Jamuna నామినేషన్ వేయడం ఏంటి? నామినేషన్‌పై డౌట్ ఉంటే ఈటల రాజేందర్ రెండు సెట్లు వేస్తారు కానీ ఇంకొకరితో ఎందుకు వేయిస్తారు? ఒకే కుటుంబం నుంచి రెండు నామినేషన్లు వేయడం ఎందుకు? జమున కూడా నామినేషన్ వేస్తే ఈటల రాజేందర్ ఊరుకుంటారా? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, జమునారెడ్డి Etela Jamuna నామినేషన్ వేయడం ఇదే తొలిసారి కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడాఈటెల జమునారెడ్డి నామినేషన్ దాఖలు చేశారని, ఇప్పటి వరకూ ఈటల రాజేందర్ ఎన్నిసార్లు నామినేషన్లు వేశారో.. అన్నిసార్లు ఈటల జమునారెడ్డి కూడా నామినేషన్ వేశారని వెల్లడిస్తున్నారు. ఆది నుంచి ఇదే అలవాటుగా, సెంటిమెంటుగా వస్తోందని, ఆమేరకు ఈసారి కూడా బీజేపీ నుంచి ఈటల రాజేందర్.. ఇండిపెండెంట్‌గా జమునారెడ్డి Etela Jamuna నామినేషన్లు వేయనున్నారని తెలుస్తోంది. ఇలా ఏళ్లుగా భార్యాభర్తలు నామినేషన్లు వేస్తున్న వ్యవహారం హుజురాబాద్‌లో ఆసక్తిగా మారింది.
ఇండిపెండెంట్ గానే .. Huzurabad bypoll
ఆరుసార్లు వరస విజయాలు సాధించిన ఈటల రాజేందర్ Etela rajendar .. ఏడోసారి పోటీకి కూడా తనతో ఏడడుగులు నడిచిన అర్థాంగితోనే కలిసి అడుగులు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఏడోసారి కూడా నామినేషన్ వేయించేందుకు, వేసేందుకు ఈటల రాజేందర్ భార్యాభర్తలిరువురూ సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఆరుసార్లు బరిలో నిలిచిన ఈటల రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమున కూడా ఆరుసార్లు నామినేషన్లు వేసి.. ఆ తర్వాత విత్ డ్రా చేసుకున్నారు. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు సెట్లు వేయగా.. మిగతా ఐదుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసి.. ఉపసంహరించుకున్నారు. ప్రతిసారీ ఈటల రాజేందర్‌తో పాటు ఆయన భార్య జమునారెడ్డి నామినేషన్ వేయడం సెంటిమెంట్‌గా కొనసాగుతోందని అంటుంటే, ఈటల రాజేందర్ Etela rajendar నామినేషన్ తిరస్కరణకు గురైతే జమునరెడ్డి Etela rajendar ని పోటిలో ఉంచే అవకాశం ఉంటుందనే ఇలా చేస్తున్నారని కూడా అంటున్నారు. అయితే, 2014లో జమునారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్టుగానే.. ఈ సారి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారా? లేక.. మిగతా ఐదుసార్లు వేసినట్టు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.